Brahma Anandam first lyrical: స‌క్సెస్‌ఫుల్ స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ నుంచి వస్తోన్న యూనిక్ ఎంట‌ర్‌టైనర్ బ్రహ్మా ఆనందం. ఈ సినిమా నుంచి 'ఆనందమానందమాయే..' అనే క్యూట్ లవ్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ప్రస్తుతం ఈ పాత పేరుకు తగినట్టే అందరిని అల్లరిస్తూ ఆనందమానందమాయే అనేలా చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్.. పూర్వంలో 100% స‌క్సెస్ రేటు సాధించిన 'మళ్లీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'మసూద' వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు మల్ల అదే తరహాలో 'బ్రహ్మా ఆనందం' కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది అని భీమా వ్యక్తం చేశారు ఈ బ్యానర్ అధినేతలు.


'బ్రహ్మా ఆనందం' చిత్రంలో హాస్య బ్రహ్మానందం, ఆయ‌న కుమారుడు రాజా గౌతమ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం శ్రీమతి సావిత్రి, శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో డెబ్యూ డైరెక్టర్ RVS Nikhil దర్శకత్వంలో రూపొందింది. సినిమా నిర్మాణం రాహుల్ యాదవ్ నక్కా చేశారు.


సినిమా నుంచి విడుదలైన 'ఆనందమానందమాయే..' పాటకు శాండిల్య పీసపాటి సంగీతం అందించారు. శ్రీసాయి కిరణ్ రాయా రాసిన ఈ పాటలో మానీషా ఈరబత్తి, యశ్వంత్ నాగ్ తమ గానంతో ప్రేక్షకులను అలరింప చేశారు. ఈ పాటలో హీరో, హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమను చాలా అందంగా చూపించారు. హీరో తన డబ్బు మీదున్న ప్రేమను, అవసరాన్ని పాడుకుంటే, హీరోయిన్ తన ప్రేమను అందంగా వివరిస్తుంది.


'బ్రహ్మా ఆనందం' చిత్రంలో వెన్నెల కిషోర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు అని తెలియజేశారు చిత్ర యూనిట్. సంపత్, రాజీవ్ కనకాల ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి శాండిల్య పీసపాటి సంగీతం అందిస్తుండగా, డీవోపీగా మితేష్ పర్వతనేని పనిచేస్తున్నారు. ఎడిటర్‌గా ప్రణీత్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్‌గా క్రాంతి ప్రియం ఉన్నారు.


'బ్రహ్మా ఆనందం' సినిమా ప్ర‌ధాన పాత్రల్లో బ్ర‌హ్మానందం, రాజా గౌతమ్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, సంపత్, రాజీవ్ కనకాల త‌దిత‌రులు కనిపించనున్నారు.


Also read: Fastag Check: సంక్రాంతికి ఊరెళ్తున్నారా, ఫాస్టాగ్ ఓసారి చెక్ చేసుకోండి లేకపోతే ఇబ్బందులే


 



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.