Brahmamudi Serial March 15th Episode: నేటి ఎపిసోడ్‌ లో కల్యాణ్ వద్దకు వచ్చిన కావ్య మా కుటుంబాన్ని ఇలా రోడ్డుపై ఎందుకు వేస్తున్నారు అంటూ అప్పును కలవకుండా ఉండటమే మంచిదన్నట్లు చెబుతుంది.  పెళ్లికి ముందు స్నేహితులు ఇప్పుడు కాదు మీకు పెళ్లైంది ఇప్పుడు వారి అభిప్రాయాలను కూడా గౌరవించాలి అంటుంది కావ్య. మిమ్మల్నే నమ్మకొని వచ్చిన అనామిక గురించి మీరు పట్టించుకోవాలి అంటుంది. అపార్థన చేసుకున్నవారికి లేదా ఇంట్లో వాళ్లు ఏమైన అనుకుంటారని అనుకుంటే నేను అప్పు ఏదో తప్పు చేసినట్లవుతుంది. అప్పును కలవాలనుకుంటే కలిసి తీరతాను అని వెళ్లిపోతాడు కల్యాణ్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెడ్‌రూంలో రాజ్ కాఫీ ఇచ్చిన కావ్య చేతిలో డబ్బు పెడతాడు. నువ్వు వేసిన డిజైన్స్ కి నేను ఇచ్చే డబ్బు అంటాడు. నెలజీతం ఇస్తారు కదా అంటుంది అప్పటిదాకా నువ్వు ఆగవు కదా.. ఫారేన్ వెళ్లిపోతావు కదా అంటాడు రాజ్. దీంతో బిత్తరపోయి చూస్తు ఉండిపోతాడు. అమ్మమ్మ, భాస్కర్లు అప్పుడే వస్తారు చూశారా? అమ్మమ్మ వెళ్లిపోమని మీ మనవడు చేతిలో ఇంత డబ్బు పెట్టాడు. నా భర్త నా కుటుంబం అంటూ చూరు పట్టుకుని వేళ్లాడితే ఆయనేమో సంబంధం లేదంటూ చెప్పేసి వెళ్లాడు. ఇలాగే చేస్తే నిన్ను ఎయిర్‌ పోర్ట్‌ లో వదిలేసిన వదిలేస్తాడు అంటుంది అమ్మమ్మ. నువ్వు నటించడానికి అహాన్ని అడ్డుపెట్టుకుంటే వాడు ఆ అహాంతో ఈ ఆటలు ఆడుతున్నాడు అందుకే ఈ కాగితాల మీద సంతకం పెట్టి వాడి మొహాన కొట్టు అంటుంది అమ్మమ్మ.


ఇంకా ఆయన మారతారా? అంటుంది అనామిక దీంతో భాస్కర్ కూడా రాజ్ కు నీపై ప్రేమ ఉంది అది బయటకు రానివ్వట్లేదు అంటాడు. ఇదిగో కావ్య ఈ విడాకుల కాగితాలు  తీసుకో ఆ తర్వాత నీ నిర్ణయం నీ ఇష్టం అని వెళ్లిపోతుంది ఇందిరా దేవి. అప్పుడు కృష్ణుడితో కావ్య ఈ ఇంటికి వచ్చినప్పుడు నాకంటూ ఓ గదిలేకపోయినా నీకంటూ ఈ గదిలో పెట్టాను. నాకు తెలియక ఆడుగుతున్నా నువ్వు 8 మంది భార్యలను ఎలా భరించావు. అంతా కృష్ణమాయ మా ఆయన కోసం ఓపిక, సర్దుబాటు అన్నీ నేర్చుకుంటాను కానీ, ఆయన అనుగ్రహం మాత్రం దొరకదు. నా దాహం తీరడానికి నేల మీద నీళ్లు ఉండాలి కదా.. ఆ పాతళ గంగను పైకి తీసుకురావాలంటే నేను ఈ కాగితం మీద సంతకం చేయాలట.. అందర్ని విడగొట్టే ఈ విడాకులు మమ్మల్ని కలుపుతాయట అంటూ కృష్ణుడి ముందు మొరపెట్టుకుంటుంది కావ్య. నేను కలవడం కోసం సంతకం చేస్తున్నాను అని కన్నయ్య సాక్షిగా విడాకుల కాగితాలపై ఏడుస్తూనే సంతకం పెడుతుంది కావ్య.


ఇదీ చదవండి: Razakar Movie Review: 'రజాకార్' మూవీ రివ్యూ.. సినిమా కాదు.. మన చరిత్ర..


గదిలో ఉన్న రాజ్ వద్దకు ఆ విడాకుల పేపర్లతో వస్తుంది కావ్య. గదిలో వెనకానుంచి వెళ్లి గట్టిగా హత్తుకుంటుంది కావ్య. మీరు నాక్కావాలి, ఎప్పటికీ మీ భార్యలాగే ఉంటాను మీకు దూరమై నేను తట్టుకోలేను ప్రశాంతంగా బతకలేను మీరు నాకు కావాలి అని పట్టుకుంటుంది కట్ చేస్తే అది కావ్య భ్రమ. అప్పుడే రాజ్ గది బయటే నిలబడ్డవేంటి అంటాడు. నెమ్మదిగా గదిలోకి వచ్చి మీ నిర్ణయం కోసం అంటుంది. ఏం నిర్ణయం అంటాడు రాజ్ ఈ కాగితాలు చూడండి అంటుంది. మీ సంతకం కావాలి అంటుంది. స్థిరాస్తులు రాసిచ్చే రైట్స్ నాకు లేవు తాతయ్యకే ఉన్నాయి అంటాడు నాకు మీ ఆస్తులేమి అక్కర్లేదు అంటుంది కావ్య. మరేంకావాలి అంటాడు రాజ్ విడాకులు అంటుంది కావ్య. ఏంటి? అవును విడాకుల పత్రం మీద నేను సంతకం చేశాను మీరు సంతకం చేయడమే బాకీ ఉంది అంటుంది కావ్య. మీరు కోరుకున్నదే కదా.. నేనేమి వెళ్లిపోతాను అనలేదు నాకు విడాకులు ఇచ్చి శ్వేతను పెళ్లి చేసుకుంటానని మీరే చెప్పారు ఆ విషయం మీరు చెప్పాకా నేనింకా మీతో కలిసి ఉండటంలో అర్థమేలేదు, భార్యగా నేను మీకు అక్కర్లేనప్పుడు మీతో కలిసి ఎంతకాలం ఇలా ఉండాలి. ఎన్నో ప్రయత్నాలు చేశాను మీరు మారతారు అనుకున్నా ఏడాది గడిచింది ఇంకా మీ ఎదురుగా ఉండి మీరు కోరుకున్నది జరగకుండా ఆపలేను మీ జీవితం మీ ఇష్టం అంటుంది కావ్య.


ఇదీ చదవండి: దుగ్గిరాల వారింట అత్తాకోడళ్ల రచ్చ రచ్చ.. అప్పుతో నా పెళ్లిని ఎవ్వరూ ఆపలేరన్న కల్యాణ్..
భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు ఉండొచ్చు మీకు నేనక్కర్లేదు అది నాకు ఆలస్యంగా అర్థమైంది. అందుకే విడాకుల పత్రాల మీద సంతకం చేసి తెచ్చాను మీరు కూడా సంతకం చేసి కోర్టుకు వెళితే సులువుగా మనకు విడాకులు మంజూరవుతాయి. కాకపోతే మీ ఇంట్లోవారికి నన్ను చెప్పమంటారా? మీరు చెబుతారా? అంటుంది. చూడాలి ఇక రాజ్ రిప్లై ఏం ఉండబోతుందో.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook