Brahmamudi Serial March 20th: నేటి ఎపిసోడ్లో కావ్య ఇందిరా దేవితో రాజ్ కోసం చేసిన ప్రయత్నాలను చెబుతోంది. ఈరోజు పూజలో కూర్చున్నప్పుడు తనకు స్థిరత్వం కనిపించలేదు  అంటుంది. ధైర్యంగా ఉండు అని ఇందిరా దేవి చెబుతుంది. తొందరగా రెడీ అయి బయటకు రమ్మంటుంది. ఇక దుగ్గిరాల వారి ఇల్లు పార్టీ కోసం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. దుష్టచతుష్టయం అంతా ఒకే చేరుతుంది. ఇక కేటరింగ్ విషయంలో ఇందిరా దేవిని అనామిక ను క్లాస్ పీకుతుంది.ఇక కల్యాణ్ స్టేజీ మీద కేక్ పెడతాడు. అది పొరపాటున కింద పడిపోతుంది దీంతో అపర్ణ కోప్పడుతుంది. ధాన్యలక్ష్మి కలుగజేసుకుని అక్క రాజమాతలా మారిపోతయి బానిసల్లా చేసుకుంటుంది అంటుంది. దీనికి అనామిక కూడా వత్తాసుపాడుతుంది. దీంతో అపర్ణ అగ్గిలంమీద గుగ్గిలంలా మారుతుంది. నీ అత్త ఈమధ్య గడ్డి తింటుంది. నువ్వు కూడా తింటున్నావా? దుష్టచతుష్టయం లా కూడి నలుగురు కూడారా? అని అనామికను నిలదీస్తుంది. గెట్‌ లాస్ట్‌ పిల్ల కాకి అని కసురుకుంటుంది అపర్ణ.ఇక మళ్లీ కేక్ తీసుకురావడానికి కల్యాణ్ వెళతాడు.మరోవైపు ఆఫీసులో రాజ్ విడాకుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బ్యాగ్రౌండ్లో ఒక ఓ సాడ్ సాంగ్ ప్లే అవుతుంది. ఈలోగా కనకం వాళ్లు ఫంక్షన్ కు వస్తారు. చూశావా? ఆంటీ సిగ్గు లేకుంటా ఎలా వచ్చారో అని అనామిక ధాన్యలక్ష్మితో అంటుంది. మనిషికి సిగ్గు మానం వదిలేసి వచ్చారు అని తిడుతుంది అప్పును ధాన్యలక్ష్మి. మమ్మల్ని పిలిచింది మా బావగారు ఆయన్ని ఎదురించే ధైర్యం ఎవరికీ లేదు అంటుంది అప్పు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావ్య మంచితనం, స్వప్ప పెంకితనం ఇక చిన్న కూతురు మగరాయుడు ముసుగులో భలే ట్రైనింగ్‌ ఇచ్చావ్ కనకం అంటుంది రుద్రాణీ. అప్పుడే కల్యాణ్ వస్తాడు. స్వప్న పనిమీద విజయవాడ వెళ్లింది. మీరు రండీ అని వారిని తీసుకెళ్తాడు కల్యాణ్.కావ్యను అమ్మమ్మ దేవకన్యలా స్టేజీవద్దకు తీసుకువస్తుంది. కనకం మురిసిపోతుంది. అప్పుడే రాజ్ కూడా కార్ దిగి స్టేజ్ వద్దకు వస్తాడు. కావ్య వద్దకు వచ్చి నిల్చుంటాడు. తన వద్ద ఉన్న విడాకుల పేపర్‌ను బయటకు తీస్తాడు. అప్పుడే అపర్ణ వచ్చి రాజ్ ఆ పేపర్లు ఏంటి? అని అడుగుతుంది.  డివోర్స్ పేపర్స్ నానమ్మ అంటాడు. అందరూ ఒక్కసారిగా నోరెళ్లబెడతారు. కావ్యవైపు చూసి చేయి పట్టుకుని స్టేజీ మీదకు తీసుకెళ్తాడు రాజ్.


మీరంతా ఎంత షాక్‌కు లోనయ్యారో నాకు తెలుసు.. ఈ నిజం ఇప్పుడైనా చెప్పాలి. మా పెళ్లై సంవత్సరం అయింది ఇద్దరం ఏనాడు ప్రేమ పంచుకోలేదు.  మీ అందరి ముందు కలిసే ఉన్నాం కానీ, గదిలో మాత్రం అపరిచితుల్లా బతికాం. కళావాతికి నామీద ప్రేమ ఉండేది. నాతో జీవితం పంచుకోవాలని ఆశ ఉండేది. ఇప్పుడే ఆశలు లేవు. దానికి కారణం నేనే. నేను మారతానని ఏడాది చూసింది చివరికి విసిగిపోయి నాతో విడాకులు తీసుకోవాలని కళావతి సంతకం చేసి ఇచ్చింది.


ఇదీ చదవండి: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌కు ముహూర్తం ఫిక్స్.. ? ఆ రోజే అనౌన్స్‌మెంట్.. ?


దీంతో ఏదో చెబుదామని కావ్య కలుగజేసుకుంటుంది. నన్ను చెప్పని అని అంటాడు. నేనే తను ఈ కాపురం వద్దనుకునేలా చేశాను. నేను పెట్టే ఒక్క సంతకంతో మేమిద్దరం శాశ్వతంగా విడిపోతామని తెలుసు..నేను మనిషినే కదా.. అందుకే మనిషిగానే మారిపోయాను. ఈ విడాకుల కాగితాల మీద నేను సంతకం చేయను.. అంటాడు. దీంతో సంబరంలో మునిగిపోతారు కనకం అమ్మమ్మలు. అస్సలు నేనెప్పటికీ కళావతికి విడాకులు ఇవ్వను అని దుఃఖంతో చెప్పి విడాకుల పేపర్లు చించేస్తాడు రాజ్. దీంతో ఆనందంగా సాగరంలో తేలిపోతుంది కావ్య. స్టేజీ మీదే కావ్యను పట్టకుని నీఓర్పు, నీ ప్రేమ, నీ సంకల్పం నన్ను ఓడించాయి.. ఖాళీ చేతులతో నీముందుంచాయ్. ఇప్పుడు నేను నీభర్తను, నువ్వు నాభార్యవు.. మనిద్దరినీ ఏ శక్తి విడదీయదు అంటాడు రాజ్. మోకరిల్లి కావ్యను ప్రపోజ్‌ చేస్తాడు. ఓ డైమండ్ రింగ్ తీసి నేనుఇప్పుడు నువ్వు కోరుకునే నేను. మనస్ఫూర్తిగా నా ప్రేమను అందిస్తున్నా.. జీవితాంతాం నీకు తోడుగా.. నీడగా ఉంటా మన కొత్త కాపురానికి ఈరోజు నుంచే శ్రీకారం చూడదాం అని కావ్యకు రింగ్ తొడుగుతాడు. అందరూ క్లాప్స్ కొడతారు. కన్నీటి పర్యాంతమవుతుంది కావ్య. ఆ చేయి పై ముద్దుకూడా పెడతాడు రాజ్. దీంతో ఇక ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుంటారు. కట్‌ చేస్తే ఇదంతా కల కంటుంది కావ్య.


ఇదీ చదవండి: హాట్ నెస్ తో చంపేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. యాషికా లేటెస్ట్ పిక్స్ అదుర్స్..
అమ్మమ్మ గిల్లగానే ఇదంతా ఒక కలా? అని అంటుంది. అయ్యగారు కలలోంచి పరిగెత్తుకుంటూ వస్తాడు నువ్వు పదా అంటుంది.  అప్పుడే రాజ్ కార్ వచ్చి నిజంగా దుగ్గిరాల వారింట ఆగుతుంది. చూడాలి కావ్యకు డివోర్స్ ఇస్తాడా? లేదా? అనేది.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి