Krishnam Raju – Brahmanandam: రెబల్ స్టార్ కృష్ణంరాజుకు బ్రహ్మానందం స్వీట్ సర్‌ప్రైజ్
Krishnam Raju – Brahmanandam: రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. శనివారం ఉదయం కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. ఆయనతో కొంతసమయం సరదాగా మాట్లాడారు. అనంతరం తాను గీసిన సాయిబాబా చిత్రపటాన్ని బహుమతిగా అందించారు.
Krishnam Raju – Brahmanandam: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇంటికి ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం వెళ్లారు. ఆయన చేతులతో గీసిన సాయి బాబా ప్రతిమను కృష్ణంరాజు దంపతులకు అందించారు. ఈ సందర్భంగా రెబల్ స్టార్ కుటుంబంతో బ్రహ్మానందం ముచ్చటించారు. బ్రహ్మానందం బహుమతిని చూసిన కృష్ణంరాజు సంతోషంతో శాలువతో ఆయన్ని సత్కరించారు.
కృష్ణంరాజుతో పలు చిత్రాలలోనూ నటించిన బ్రహ్మానందం ఆయన గొప్పతనాన్ని మరోమారు గుర్తు చేసుకున్నారు. ఎదుటివ్యక్తిని గౌరవించే గొప్ప సంస్కారి కృష్ణంరాజు అని చెప్పారు. “నేను ఎప్పుడు ఆయనను కలిసినా, సరస్వతీ దేవిని చూసినట్టు ఉంటుందని కృష్ణంరాజు గారు చెబుతుంటారు. మొన్న సాయిబాబా చిత్రపటాన్ని అందించడానికి వెళ్ళినప్పుడు కూడా అదే ఆదరణను చూపుతూ, ఆ సంస్కారం తనకు తన తండ్రి నుండి అబ్బిందని కృష్ణంరాజు గారు చెప్పడం గొప్ప ఆనందాన్ని కలిగించింది. అలాంటి లివింగ్ లెజెండ్ కు నేను గీసిన షిర్డీ సాయినాధుని బొమ్మను ఇవ్వడం సంతోషంగా అనిపించింది” అని బ్రహ్మానందం అన్నారు.
బ్రహ్మానందం తనకు ఇచ్చిన సాయిబాబా చిత్రపటాన్ని.. ఆ సందర్భంగా బ్రహ్మానందాన్ని సత్కరించిన ఫోటోను కృష్ణంరాజు శనివారం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. “కామెడీ జీనియస్ బ్రహ్మానందం ఆర్ట్ జీనియస్ కూడా! అద్భుతమైన ప్రతిభ ఉన్న అందమైన వ్యక్తి ఆయన. బ్రహ్మానందం ఇచ్చిన స్వీట్ సర్ ప్రైజ్ కు ధన్యవాదాలు” అంటూ ‘గాడ్ బ్లస్ యూ బ్రహ్మానందం’ అని కష్ణంరాజు ఆశీర్వదించారు.
Also Read: Balakrishna pays Final Respects to Puneeth: పునీత్‌ను కడసారి చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ
Also Read: RRR Movie Update: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి సర్‌ప్రైజ్.. మూవీ గ్లింప్స్ విడుదల తేదీ ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook