Brahmanandam: గిన్నిస్ అవార్డు గ్రహీత చేతుల మీదుగా ఐఫా అవార్డు అందుకున్న కామెడీ బ్రహ్మ..
IIFA Awards: సౌత్ సినీ ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న ఐఫా అవార్డుల వేడుక.. రానే వచ్చింది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు అవార్డులు అందుకున్నారు. తాజాగా ఈ జాబితాలో మన కామెడీ బ్రహ్మానందం పేరు కూడా చేరింది. రంగ మార్తాండ సినిమాకి గాను అవార్డు తెచ్చుకున్న బ్రహ్మానందం.. ఈ అవార్డును స్వయానా మెగాస్టార్ చేతుల మీదుగా అందుకున్నారు.
Brahmanandam IIFA Awards: ఐఫా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరుగుతూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సౌత్ ఇండస్ట్రీ నుండి.. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి చాలామంది సెలబ్రిటీలు.. తమ సినిమాలతో తమ సత్తా చాటి అవార్డులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా ఐఫా అవార్డు అందుకున్నారు.
ఈ మధ్యనే బ్రహ్మానందం నటించిన రంగమార్తాండ ఆ సినిమాకి గాను.. మేల్ క్యాటగిరిలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డును అందుకున్నారు బ్రహ్మానందం. ఎప్పుడు తన సినిమాలతో నవ్వించే బ్రహ్మానందం.. రంగమార్తాండ సినిమాతో మాత్రం అందరికంటా నీళ్లు తెప్పించారు. సినిమాలో బ్రహ్మానందం తన అద్భుతమైన నటనతో అందరినీ కట్టిపడేసారు.
ఈ నేపథ్యంలోనే బ్రహ్మానందం ఇప్పుడు.. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్ అవార్డును కూడా అందుకున్నారు. ఈ అవార్డును మెగాస్టార్ చిరంజీవి తన చేతుల మీదగా అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ మధ్యనే చిరంజీవి గిన్నిస్ రికార్డులలో తన పేరు జత చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే బ్రహ్మానందం కూడా గిన్నీస్ రికార్డులలో చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక గిన్నిస్ అవార్డు గ్రహీత చిరంజీవి.. మరొక గిన్నిస్ రికార్డు హోల్డర్ బ్రహ్మానందం కి ఐఫా అవార్డు ఇస్తున్నారు.. అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరోవైపు నాని ఐఫా అవార్డులలో కూడా తన సత్తా చాటారు. నాని హీరోగా నటించిన దసరా సినిమాకి ఈ సంవత్సరం బెస్ట్ సినిమా అవార్డు లభించింది. అదే సినిమాకి నాని బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నారు. ఆసక్తికరంగా బెస్ట్ ఫిమేల్ యాక్టర్ క్యాటగిరి లో కూడా నాని సరసన హాయ్ నాన్న లో నటించిన మృణాల్ ఠాకూర్ గెలుచుకుంది.
Read more: Hydra Victims: నీ అయ్య జాగీరా ఎవడ్రా నువ్వు మా ఇల్లు కూలగొట్టేది.. హైడ్రా వర్సెస్ మూసీ బాధితులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.