Brahmastra 2 makers approach Vijay Deverakonda to play Dev: బాలీవుడ్ లో రూపొందిన బ్రహ్మాస్త్ర సినిమా మొదటి భాగం బ్రహ్మాస్త్ర శివ పార్ట్ 1 ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో కూడా బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ అయింది, ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించకపోయినా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి వసూళ్లు కూడా రాబట్టింది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను మైమరిపించే విధంగా సాగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలో విడుదలై మరోసారి ప్రేక్షకులను అందిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన రెండో భాగం మీద దృష్టి పెడుతున్నారు. ఈ రెండవ భాగం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. మొదటి భాగం శివలో రణబీర్ కపూర్ శివ అనే పాత్రలో కనిపిస్తాడు. అతని తండ్రిగా దేవ్ అనే వ్యక్తి కనిపిస్తాడు. మొదటి భాగంలో దేవ్ ఎవరు అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ దేవ్ పాత్రలో నటించవలసిందిగా హృతిక్ రోషన్, రణవీర్ సింగ్ అలాగే సౌత్ స్టార్ హీరో యష్ ను కూడా మేకర్స్ సంప్రదించారు.


అయితే వారెవరూ ఆ పాత్ర చేసేందుకు ఆసక్తి చూపించలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు లైగర్ హీరో విజయ్ దేవరకొండను ఆ పాత్రలో నటించమని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సినిమాని లైగర్ నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. వీరిద్దరూ కలిసి లైగర్ సినిమా కోసం పనిచేయడంతో ఒకరి గురించి ఒకరికి బాగా పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండను ఈ దేవ్ పాత్రలో నటించమని కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది.


అయితే కథ విన్న తర్వాత విజయ్ దేవరకొండ ఆలోచించి చెప్తానని చెప్పారని ఒకవేళ విజయ్ దేవరకొండ కనుక సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తే కనుక ఈ ప్రాజెక్టు మరింత ఊపు తెచ్చుకోవడం ఖాయం అని తెలుస్తుంది. ఎందుకంటే మొదటి భాగంలో నాగార్జున వంటి హీరో నటించిన తెలుగులో పెద్దగా బజ్ ఏర్పడలేదు.


ఒకవేళ విజయ్ దేవరకొండ మాత్రం దేవ్ పాత్రలో గనుక నటిస్తే ఒక్కసారిగా సినిమా మీద మరింత హైప్ పెరగటం ఖాయంగా తెలుస్తోంది. వాస్తవానికి లైగర్ అనే సినిమాతో సూపర్ హిట్ కొడదామని అటు విజయ్ దేవరకొండ ఇటు కరణ్ జోహార్ ఇద్దరూ అనుకున్నారు. కానీ అది ఎందుకో వర్కౌట్ కాలేదు. మరో ప్రాజెక్ట్ చేయాలని వీరిద్దరూ భావిస్తున్న సమయంలోనే ఈ ప్రాజెక్టు కూడా తెరమీదకు రావడంతో దాదాపుగా ఈ ప్రాజెక్టు కు విజయ్ దేవరకొండ ఒకే చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది.


Also Read: Sobhu Yarlagadda on KTR: కేటీఆర్ అప్పుడూ కూలే, ఇప్పుడూ కూలే.. బాహుబలి నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్!


Also Read: Kamal Haasan Birthday party : కమల్ హాసన్ బర్త్ డే.. పెద్ద కుటుంబమే.. తళుక్కుమన్న మణిరత్నం, సుహాసిని



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook