Brahmmavaram PS Paridhilo Movie Updates: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 'బ్రహ్మవరం పీఎస్‌ పరిధిలో' సినిమా ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. ఇమ్రాన్ శాస్త్రి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని ఆగస్టు 23న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో స్రవంతి బెల్లంకొండ, గురు, సూర్య శ్రీనివాస్, హర్షిణి ప్రధాన పాత్రలు పోషించారు. స్రవంతి బెల్లంకొండ కీలక పాత్ర పోషించడంతోపాటు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. సినిమాటిక్ ట్రీట్‌గా ఉంటుందని.. తప్పకుండా ఆడియన్స్‌ను మెప్పిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: iQOO Neo9 Pro 5G Price Drop: వావ్‌ ఏం డిస్కౌంట్‌.. రాఖీ వేళ అమెజాన్‌లో Iqoo Neo9 Pro 5G మొబైల్‌పై రూ.33,000 తగ్గింపు!


ఈ సందర్భంగా స్రవంతి బెల్లంకొండ మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమాకు కథే నిజమైన హీరో అని అన్నారు. కొత్తదనం కోరుకునే ఆడియన్స్‌కు ఈ సినిమా ఫస్ట్ ఆప్షన్‌ అవుతుందన్నారు. సమ్మెట గాంధీ, ప్రేమ్ సాగర్, జీవా, రూప లక్ష్మి వంటి టాలెంటెడ్ నటులతో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభవమని అన్నారు. తనను ప్రధాన పాత్రలో ఎంపిక చేసినందుకు టీమ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 23న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తున్నామని.. ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.


డైరెక్టర్ ఈ చిత్రాన్ని నెక్ట్స్ లెవల్ అన్నట్లుగా చిత్రీకరించారని చెప్పారు స్రవంతి బెల్లంకొండ. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు మెచ్చే చిత్రమవుతుందన్నారు. ఈ మూవీకి ఎడిటర్‌గా ఆవుల వెంకటేష్ పనిచేశారు. శ్రీ వెంకట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిచగా.. శ్రీనివాస్ మౌళి లైవ్ లిరిక్స్, సాకేత్ సాయిరామ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. DOP బాధ్యతలు ముజీర్ మాలిక్ నిర్వర్తించారు.


Also Read: Raksha Bandhan 2024: వైఎస్‌ జగన్‌కు రాఖీ కట్టని షర్మిల.. అన్నాచెల్లెళ్ల మధ్య పెరుగుతున్న దూరం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter