Breaking News: సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన చిత్రం 'జైలర్' గత నెల 10వ తేదీన థియేటర్లలో విడుదలై బ్లాక్‌బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇందులో నటించిన అందరికీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ మూవీలోని విలన్ వర్మ గ్యాంగులో కీలక అనుచరుడిగా నటించిన జి.మారిముత్తు (57) హాఠాన్మరణం చెందారు. శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు. మారిముత్తు మృతిపై కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. మారిముత్తు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా ఆయన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జి.మారిముత్తు కెరీర్..
మారిముత్తు ఎన్నో బుల్లితెర సీరియల్స్ లో నటించడం సహా కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. వెండితెరపై ఎన్నో మరపురాని పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. ధారావాహికల ద్వారా తమిళనాట ప్రతి ఇంటా పరిచయమైన మారిముత్తు.. దర్శకుడిగా మాత్రం విజయం సాధించలేకపోయారు. ఇంక చివరికి ఆయన సినిమాల్లో పాత్రలు వేస్తూ వచ్చారు. విలన్ అయినా.. సైడ్ క్యారెక్టర్ అయినా మారిముత్తు అవలీలగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 


Also Read: Memes About India's Name Change: ఇండియా పేరు మార్పు అంశంపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వైరల్


సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన జైలర్ మూవీలో మారిముత్తు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. విలన్ వర్మ పక్కన ఉండే కీలక అనుచరుడిగా కనిపిస్తాడు. అయితే చివరికి ఆ పాత్రని విలన్ వర్మనే చంపడం కొసమెరుపు. మారిముత్తు మరణంతో కోలీవుడ్ ప్రముఖులు, తమిళ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ఆయనకి నివాళి అర్పిస్తున్నారు. 


తమిళంలో వచ్చిన 'ఎథిర్ నీచల్' ధారావాహికలో ఆయన పోషించిన ఆదిముత్తు గుణశేషరన్ పాత్రకు మంచి ప్రశంసలను అందుకున్నారు. 'కన్నుమ్ కన్నుమ్' సినిమాతో దర్శకుడిగానూ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ, అనుకున్నంత సక్సెస్ ను ఆయన దక్కించుకోలేకపోయారు. హీరో అజిత్ నటించిన 'వాలి' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన మారిముత్తు.. చివరిగా 'విక్రమ్', 'జైలర్' సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం 'ఇండియన్ -2' సినిమాలోనూ ఓ కీలక పాత్ర నటిస్తున్నారని సమాచారం.


Also Read: Weight Loss Tips: అధిక బరువు సమస్యకు చెక్, వాముతో 4 అద్భుతమైన చిట్కాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook