Bride Plays Chenda in Guruvayoor Temple సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుంటుందో చెప్పలేం. పెళ్లిళ్లు జరిగే ట్రెండ్ మారుతోంది. తల దించుకుని మండపంలో కూర్చునే పెళ్లీ కూతుళ్లు అందరూ నోరెళ్లెబెట్టేలా డ్యాన్సులు వేస్తున్నారు. గ్రాండ్‌ ఎంట్రీ అంటూ.. పెళ్లి కూతురి గెటప్పులో డ్యాన్సులు వేస్తున్నారు. కొన్ని చోట్ల తల్లిదండ్రులతో కలిసి డ్యాన్సులు చేస్తూ పెళ్లి కూతురి ఎంట్రీ ఇస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరి కొన్ని చోట్ల భార్యాభర్తలు కలిసి మండపంలోనే స్టెప్పులు వేస్తుంటారు. ఇక ఇప్పుడు తాజాగా ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.ఈ వీడియోలో పెళ్లి కూతురు ఆనందం మొత్తం ఆమె కళ్లలోనే కనిపిస్తోంది. తండ్రి వాయించే వాయిద్యాలను అందుకుని.. దుమ్ములేచేలా వాయించింది ఆ పెళ్లి కూతురు. అసలు మ్యాటర్ ఏంటో ఓ సారి చూద్దాం.


గురవయూర్ దేవాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి కూతురు తండ్రి వృత్తి చెందా పరికరాన్ని వాయించడం. పెళ్లిలో ఈ చెందా వాయిద్యాలను ప్రత్యేకంగా వాయిస్తుంటారు. అయితే తన తండ్రి వృత్తిలోని టాలెంట్‌ని తన పెళ్లిలో స్వయంగా పెళ్లి కూతురే ప్రదర్శించింది. ఇక పెళ్లి కూతురు కొట్టిన ఈ సౌండ్‌కు సోషల్ మీడియాలో రీసౌండ్ వినిపిస్తోంది.


 



ఇక ఈ వీడియోను చూస్తే మన తెలంగాణలో బుల్లెట్ బండి పెళ్లి కూతురు గుర్తుకు రావాల్సిందే. ఇలా పెళ్లిలో సందడి చేసే పెళ్లి కూతుళ్ల వీడియోలు ఇప్పుడు బాగానే ట్రెండ్ అవుతున్నాయి. ఆ అమ్మాయి వీడియో బాగా నచ్చిందంటూ గృహలక్ష్మీ తులసి ట్వీట్ వేసింది.


Also Read : Pawan Kalyan Unstoppable : పేరు తెలీదు అన్నోడే పడిగాపులు కాసేలా.. పవన్ బాలయ్య మీటింగ్‌పై మంట పెట్టిన మెగా ఫ్యాన్ ట్వీట్


Also Read : Sudigali Sudheer Love : ఊపిరి ఉన్నంత వరకు ఆమెనే ప్రేమిస్తుంటా.. అసలు విషయం చెబుతూ ఫోటోను చూపించిన సుడిగాలి సుధీర్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook