Britney Spears: గుడ్ న్యూస్ చెప్పిన బ్రిట్నీ స్పియర్స్.. మూడో బిడ్డ కోసం రెడీ..
Britney Spears: తండ్రితో సంరక్షణ వివాదం ముగిసిన తర్వాత బ్రట్ని స్పియర్స్ తన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ ఏడాదే శామ్ అస్గారీని వివాహమాడిన బ్రిట్నీ.. తాజాగా తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించారు.
Britney Spears: ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ఇన్స్టావేదికగా గుడ్ న్యూస్ చెప్పారు. తాను మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు.
'నేను ప్రెగ్నెసీ టెస్ట్ చేయించుకున్నాను.. ఓ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలిసి సంతోషిస్తున్నాను.' అని ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. అయితే బ్రిట్నీ తన ఇన్‌స్టాలో చెప్పిన ఓ విషయంపై ఫ్యాన్స్ గందరగోళంలో పడ్డారు. హాలీడేను ఎంజాయ్ చేస్తున్న బ్రిట్నీ బరువు పెరగటంతో టెస్టు చేయించుకోగా ప్రెగ్నెంట్‌గా తేలినట్లు వెల్లడించారు.
కొన్నాళ్ల క్రితం బరువు తగ్గిన నేను.. తిరిగి బరువు పెరిగేందుకు మయి ట్రిప్‌కు వెళ్లాను. ఉన్నట్టుండి.. బరువు పెరిగాను. ఏమై ఉండొచ్చని నా భ్రతరను అడగ్గా.. ఇది ఫుడ్ ప్రెగ్నెంట్ అని తను జోక్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
బ్రిట్నీ స్పియర్స్ ఈ ఏడాదే శామ్ అస్గారీని వివాహమాడింది. ఇంతకు ముందు అమెకి శాంమ మూడో భర్త. కాగా బ్రిట్నీకి ఇప్పిటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అమె తండ్రి చెరనుంచి విముక్తి పొందిన ఐదు నెలల తర్వాత మరోసారి తన ప్రెగ్నెన్సీ విషయం చెప్పి వార్తల్లో బ్రిట్నీ స్పియర్స్.
తండ్రితో వివాదం ఏమిటి?
2008లో బ్రిట్నీ స్పియర్స్ మానసిక సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో అమె సంరక్షణ బాద్యతలను తండ్రికి అప్పగించింది అమెరికా కోర్టు. అయితే అమె తండ్రి సంరక్షణ పేరుతో తన స్వేచ్ఛను హరిస్తున్నారని కోర్టుకెక్కారు బ్రిట్నీ. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వత.. అమెరికా లాస్ ఏంజలెస్‌లోని కోర్టు అమె తండ్రికి సంరక్షణ బాధ్యతలు తొలగిస్తూ తీర్పు నిచ్చింది.
Also read: Childhood Pic: ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా... ట్రై చేయండి...
Also read: Naga Chaitanya Fined: హీరో నాగ చైతన్యకు ట్రాఫిక్ పోలీస్ జరిమానా...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook