Bro Full Movie Leaked Online: బ్రో మూవీ బాక్సాఫీస్ కమెర్షియల్ సక్సెస్‌ని ఎంజాయ్ చేయాలని ఆశించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి, మెగా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం స్టార్ సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన బ్రో మూవీకి రిలీజ్ రోజే పైరసీ దెబ్బ తగిలింది. ఇంకా చెప్పాలంటే రిలీజైన కొన్ని గంటల్లోనే బ్రో ఫుల్ మూవీ ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. మూవీరూల్స్, తమిళ్ రాకర్స్, ఫిల్మీజిల్లా, ఐ బొమ్మ, తమిళ్‌యోగి, తమిళ్‌బ్లాస్టర్స్ వంటి వెబ్‌సైట్లలో లీకైంది అని జూమ్ టీవీ ప్రచురించిన ఓ కథనం పేర్కొంది. అది కూడా అలాంటి ఇలాంటి సాధారణ ప్రింట్ కాదు... ఏక్ ధమ్ ఫుల్ క్లారిటీ ఉన్న HD ప్రింట్ లీకైనట్టు తెలుస్తోంది. బ్రో మూవీ బాక్సాఫీస్‌పై ప్రభావం చూపే ఈ పరిణామం ఆ చిత్ర నిర్మాతలను కలవరపాటుకు గురిచేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్రో మూవీ పైరసీ బారినపడటంపై ఆ చిత్ర నిర్మాతలైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ లీగల్ యాక్షన్ కి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ తమిళనటుడు, దర్శకుడు సముద్రఖని 2021 లో తమిళంలో డైరెక్ట్ చేసిన వినోదయ సితం అనే సినిమాను తెలుగులో బ్రో పేరిట స్వయంగా సముద్రఖనినే డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించాడు. 



ఇది కూడా చదవండి :  Bro Movie: 'బ్రో'మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఫిక్స్.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?


తుపాకీ కాల్చినట్టు సైగ చేస్తూ కన్ను కొట్టిన దృశ్యంతో నేషనల్ సెన్సేషన్ అయిన కేరళ కుట్టి ప్రియ ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ బ్రో సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్స్ పాత్రల్లో కనిపించారు. సముద్రఖని, రోహిని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. స్టార్ హీరోల సినిమాలు ఇలా విడుదలైన రోజే పైరసీ బారిన పడటం కొత్తేం కాదు. గతంలోనూ స్టార్ హీరోలు అందరికీ ఈ పైరసీ సమస్య ఎదురైంది.


ఇది కూడా చదవండి :  BRO Twitter Review: బ్రో ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఇదే.. పవన్ స్టామినాకు తగ్గట్లే..!


{ గమనిక : కాపీరైట్ యాక్ట్ 1957 ప్రకారం పైరసీ అనేది నేరం. జీ న్యూస్ తెలుగు పైరసీని ఏ రకంనూ ప్రోత్సహించడం కానీ లేదా మద్దతు ఇవ్వడం కానీ చేయదు. పైరసీకి వ్యతిరేకంగా పోరాడే వారికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఇది కేవలం ఒక వార్తా కథనం మాత్రమే అని గుర్తించగలరు. ) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి