BRO Movie Poster: `బ్రో` టీజర్ అప్డేట్.. మాస్ లుక్‌లో మామా అల్లుళ్లు..!
Bro Movie Update: పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న మూవీ `బ్రో`. సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. తాజాగా టీజర్ కు సంబంధించిన ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మామా అల్లుళ్లు లుక్ అదిరిపోయింది.
Bro Movie Poster Release: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం 'బ్రో(Bro)'. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇది వినోదయ సీతం అనే తమిళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ రిలీజైంది. ఇందులో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ లుంగీ కట్టుకని మాస్ లుక్ లో సందడి చేశారు. ఈ లుక్ పై మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే.. తమ్ముడు సినిమాలో పవన్ ను చూసిన ఫీలింగ్ వస్తుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు. తేజ్ కూడా మామకు తగ్గ అల్లుడిగా ఉన్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ లుక్ ఓ స్పెషల్ సాంగ్ కోసమేనంటూ మరో రూమర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ చేశారు.
Also Read: Project K Update: రెండు పార్టులుగా ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ?
ఈ సినిమాలో పవన్ దేవుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో పవర్ స్టార్ 'గోపాల గోపాల' సినిమాలో శ్రీకృష్ణుడిగా నటించిన సంగతి తెలిసిందే. రేపు (జూన్ 28) ఈ మూవీ టీజర్ కు సంబంధించిన అప్ డేట్ ఇవ్వనున్నట్లు దర్శకుడు సముద్రఖని ట్వీట్ చేశారు. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్ తోపాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరిపై వివేక్ కూచిబోట్ల, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి