Bruce Willis Diagnosed With Untreatable Dementia: ఈ మధ్య కాలంలో సినీ నటులు అనేక రకాల వ్యాధులతో బాధ పడుతున్న విషయాలు తెర మీదకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అలంటి విషయమే ఒకటి తెర మీదకు వచ్చింది. హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వెటరన్ యాక్టర్ బ్రూస్ విల్లీస్ తీవ్ర అస్వస్థత కారణంగా ఏడాది క్రితం తన నట జీవితానికి విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. . బ్రూస్ విల్లీస్ అఫాసియాతో బాధపడుతున్నట్లు నటుడి కుటుంబం ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇప్పుడు బ్రూస్ విల్లీస్ ఆరోగ్యం మరింత విషమించిందని తెలుస్తోంది. తాజాగా, బ్రూస్ విల్లీస్ ఆరోగ్యం గురించి ఆయన కుటుంబం మరో ప్రకటన చేసింది. అఫాసియా తర్వాత బ్రూస్‌కు ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా కూడా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు కుటుంబం చేసిన ప్రకటనలో తెలిపింది. 2022 సంవత్సరంలో, బ్రూస్‌కు అఫాసియా ఉందని ప్రకటించిన తర్వాత అతని పరిస్థితి మెరుగుపడింది,  అయితే బ్రూస్‌కు ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా (FTD) అనే వ్యాధి కూడా ఉందని ఇప్పుడు తేలడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది.


ఇక కమ్యూనికేషన్‌లో ఇబ్బంది పడడం ఈ వ్యాధి యొక్క లక్షణం అని అంటున్నారు, ఇది చాలా బాధాకరమైనదిగ ఉంటుందని అంటున్నారు. ఇక బ్రూస్ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఆయన కుమార్తె రూమర్ విల్లిస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. భాషకు సంబంధించిన మెదడులోని ప్రాంతాలను ప్రభావితం చేసే రుగ్మతలకు ఈ జబ్బు కారణం అవుతుందని ఆమె పేర్కొన్నారు.


ఇంతేకాక వ్యక్తిత్వ మార్పులు, మాట్లాడటం కష్టం అవడం, భాషకు సంబంధించిన మెదడులోని ప్రాంతాలను ప్రభావితం చేసే సమస్యలను కలిగిస్తుందని ఆమె అన్నారు. యాక్షన్ హీరో బ్రూస్ విల్లీస్ 1980 లలో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. అప్పుడు నటుడు బ్రూస్ విల్లీస్ తన అత్యంత ప్రజాదరణ పొందిన 'డై హార్డ్' సిరీస్‌కి బాగా ఫేమస్ అయ్యాడు. ఇక ఆయన సుదీర్ఘ కెరీర్‌లో, 'అవుట్ ఆఫ్ డెత్', 'ది వెర్డిక్ట్', 'మూన్‌లైటింగ్', 'ది బాక్సింగ్', 'హోస్టేజ్', 'గ్లాస్' వంటి సినిమాల్లో కూడా నటించారు. 
Also Read: Sapna Gill Background: 'పృథ్వి షా'పై దాడి చేసింది హీరోయినా? ఆమె బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదే!


Also Read: Shehzada vs Pathaan: 'అల' రీమేక్ కు దిమ్మతిరిగే షాక్.. దెబ్బకు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ ఆఫర్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook