Trolls on Shriya Saran New Dress: వయసు పెరిగినా.. వన్నె తగ్గని అందంతో మెరుపులు మెరిపిస్తోంది సీనియర్ నటి శ్రియా. బోల్డ్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ మత్తెక్కిస్తోంది. తాజాగా వైరెటీ డ్రెస్ ధరించిన శ్రియా.. కవర్ చేసుకునేందుకు తంటాలు పడింది. అయితే శ్రియా ధరించిన ఈ డ్రెస్‌పై నెట్టింట భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. 'ఉర్ఫీ జావేద్‌కి కాపీ' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శనివారం రాత్రి డెనిమ్ కటౌట్ డ్రెస్‌లో అవార్డుల ఫంక్షన్‌కు బ్లూ కట్ అవుట్ డ్రెస్‌లో శ్రియా ఆకర్షణీయంగా కనిపించింది. అయితే నెటిజన్లు ఆమె ఫ్యాషన్ వేర్‌ను విమర్శించారు. శ్రియా వీడియోపై ట్రోలింగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రియా డ్రెస్ జారిపోతుండగా.. సైడ్‌లో హాట్ స్పాట్‌లను కవర్ చేసుకునేందుకు ఇబ్బంది పడింది. చివరకు డ్రెస్‌ను చేతితో పట్టుకుని కారులో ఎక్కి కూర్చొంది. నడుము వద్ద లోతైన కట్ అవుట్..  పక్కన మోకాలి వరకు డ్రెస్‌కు చీలికలు ఉన్నాయి. ఆఫ్ షోల్డర్ డ్రెస్‌కు అందమైన ఉపకరణాలతో యాడ్ చేసింది. లేటెస్ట్ పిక్స్‌ను శ్రియా సోషల్ మీడియాలో షేర్ చేసింది.


Also Read: Dalit Bandhu Phase 2: దళిత బంధు రెండో విడతకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్



 



ఇంత స్టుపిడ్ డ్రెస్ ఎందుకు ధరించారంటూ నెటిజన్ల మండిపడుతున్నారు. "ఇలాంటి డ్రెస్‌లు ధరించి హైక్లాస్ అనుకుంటారు. కానీ అన్ని సమయాల్లోనూ క్లాసీగా ఉండదు.. చీప్ ఫ్యాషన్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతగా ఇబ్బందిపడే బదులు.. వేరే డ్రెస్ ధరించవచ్చు కాదా..? అని సూచిస్తున్నారు. మొత్తానికి శ్రియా ఫొటోలు, వీడియోపై నెట్టింట భారీగా ట్రోలింగ్ జరుగుతోంది.



 



ఒకప్పుడు టాలీవుడ్‌లో నెంబర్ వన్‌ హీరోయిన్‌గా ఉన్న శ్రియా.. ప్రస్తుతం నటిగా బిజీగా ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో వరుస అవకాశాలు అందుకుని దూసుకువచ్చింది. బాలీవుడ్ దృశ్యం-2 మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. కన్నడలో కబ్జా మూవీతో అలరించింది. ఇటీవల శర్మన్ జోషితో కలిసి 'మ్యూజిక్ స్కూల్' మూవీలో కనిపించింది. ఇందులో మ్యూజిక్ టీచర్ రోల్‌ను శ్రియా పోషించింది. ప్రస్తుతం శ్రియా చేతిలో ఉన్న ఆఫర్ల గురించి అధికారిక ప్రకటనరాలేదు. మరోవైపు ఈ హాట్ హీరోయిన్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది. లేటెస్ట్ ఫొటోషూట్స్‌తో అభిమానులకు గ్లామర్ అందాలను పంచుతోంది.


Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి