Leo Movie Update:  కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay), డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‍లో వస్తున్న మూవీ 'లియో'(Leo Movie). విక్రమ్ తర్వాత లోకేశ్ చేస్తున్న సినిమా కావడంతో మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రం ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‍తో పాటు త్రిష, అర్జున్ సజ్జా, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లియో నుంచి ఇప్పటికే వచ్చిన 'నా రెడీ..' ఫస్ట్ సాంగ్ మంచి టాక్ తెచ్చుకుంది. రీసెంట్‌గా రిలీజైన సంజయ్‌ గ్లింప్స్‌ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే టాకీ పార్ట్‌ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్‌ సహా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఒక్కోటి కొలిక్కి  వస్తున్నాయి. ఈ మూవీ పాన్‌ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈనేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో ఫ్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు లోకేష్ ఓపెన్‌ ఎండింగ్‌ను ప్లాన్‌ చేశాడని సమాచారం. అంటే ఖైదీ, విక్రమ్ సినిమాలకు సీక్వెల్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లుగానే లియో సినిమాకు కూడా పార్ట్‌-2ను ప్లాన్‌ చేస్తున్నారట. ఈ వార్త తమిళనాట తెగ వైరల్ అవుతోంది. దీని గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 


ఈ మూవీలో కీ రోల్ చేస్తున్న అర్జున్‌ సర్జా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఆగస్టు 15న రిలీజ్‌ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ బిజినెస్ కూడా భారీగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం సితార సంస్థ ఏకంగా 21 కోట్లు పెట్టి కొనడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ మూవీ  భగవంత్ కేసరీ, టైగర్‌ నాగేశ్వరరావు వంటి సినిమాలకు పోటీగా దసరాకు రానుంది. తమిళనాడులో సైతం ఈ సినిమా కోసం పలువురు డిస్ట్రిబ్యూటర్‌లు పోటీ పడుతున్నట్లు వార్తలు వన్తున్నాయి. లోకేష్-విజయ్ కలయికలో గతంలో 'మాస్టార్' అనే సినిమా వచ్చింది. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. 


Also Read: IFFM 2023 Awards: ఉత్తమ చిత్రంగా ‘'సీతారామం'’..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి