Raviteja - BVS Ravi: డైరెక్టర్ ను చితక్కొట్టిన రవితేజ.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే!
BVS Ravi in Dhamaka Movie: క్రాక్ సినిమాతో నటుడిగా మారిన బీవీఎస్ రవి ఇప్పుడు రవితేజ మరో సినిమా ధమాకాలో కూడా కీలక పాత్రలో నటించారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
BVS Ravi Plays A Role in Dhamaka Movie: అదేంటి మాస్ మహారాజా రవితేజ ఒక డైరెక్టర్ ని కొట్టాడా? ఇదెక్కడి వార్త అని అనుకుంటున్నారా? అయితే ఇది నిజం కాదండోయ్ ఆయన కొట్టింది సినిమాలో. అసలు విషయం ఏమిటంటే రవితేజ గత ఏడాది క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో మరో సినీ రచయిత దర్శకుడు బివిఎస్ రవి అలియాస్ మచ్చ రవి కూడా కీలక పాత్రలో నటించారు. ఆ సినిమాలో ఆయన పాత్ర ద్వారా మంచి క్రేజ్ అయితే దక్కించుకున్నారు. ఇక అదే ఫ్లో కంటిన్యూ చేస్తూ రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో కూడా ఆయనకు అవకాశం దొరికింది.
త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మలక్పేట్ మల్లేష్ అనే ఒక పాత్రలో బీవీఎస్ రవి కనిపిస్తారు. అంటే మలక్పేట్ ప్రాంతానికి చెందిన ఒక పహిల్వాన్ పాత్రలో ఆయన నటించారు. కథ ప్రకారం రవితేజ మలక్పేట ప్రాంతానికి వెళ్లి మలక్పేట మల్లేషన్న అదేనండీ మన బివిఎస్ రవికి వార్నింగ్ ఇవ్వటమే కాకుండా చితక్కొడతాడు.
అలా ఆయనని కొట్టి హీరోయిన్ ప్రేమలో పడేస్తాడు. అంటే అలా రవితేజ డైరెక్టర్ బీవిఎస్ రవిని కొట్టారు అన్నమాట. రవితేజ హీరోగా నటించిన ధమాకా మూవీ డిసెంబర్ 23వ తేదీన ఘనంగా విడుదలైంది. త్రినాధ రావు నక్కిన డైరెక్షన్లో బెజవాడ ప్రసన్న కుమార్ అందించిన కథ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. సినిమా చూసిన ప్రేక్షకులందరూ సినిమా పైసా వసూల్ ఎంటర్టైనర్ అని సినిమా బాగా కుదిరిందని కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Pooja Hegde Iron Leg: పాపం పూజ హెగ్డేని మళ్లీ ఐరెన్ లెగ్ అంటున్నారే!
Also Read: Kaikala Satyanarayana Last Wish: చిరంజీవిని కోరిన చివరి కోరిక తీరకుండానే చనిపోయిన కైకాల.. అదేంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.