Can Shahrukh Khan Watch the Pathan Film with His Daughter: షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన పఠాన్ సినిమా మీద ఏర్పడిన వివాదం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ శాసనసభ స్పీకర్ గిరీష్ గౌతమ్ వింత డిమాండ్ కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆయన షారుఖ్ ఖాన్ సినిమాని చెత్తగా అభివర్ణించడమే కాక తన 23 ఏళ్ల కుమార్తెతో కలిసి ఈ సినిమా చూడాలని హీరోని సవాల్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఈ సినిమాని వదిలేశారని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన విషయమైతే మహ్మద్ ప్రవక్త పేరుతో ఒక సినిమా తీసి చూపించండని డిమాండ్ చేశారు. అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ మాట్లాడుతూ, హోంమంత్రి డాక్టర్ నరోత్తమ్ మిశ్రా ప్రకటనకు నేను మద్దతు ఇస్తున్నానని అన్నారు. వీరు ఒక్క మతాన్ని మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? వారికి ధైర్యం ఉంటే, మహమ్మద్ ప్రవక్త మూవీ చేసి, ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ఉపయోగించి చూపించండని డిమాండ్ చేశారు.


అలా చేస్తే కనుక ప్రపంచమంతటా రక్తపాతం జరుగుతుందని అన్నారు. కెనడాలో ప్రవక్తకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే ముంబై తగలబడిందని అదే ఇప్పుడు హిజాబ్ గురించి వస్తే అది ఇరాన్ సమస్య అని అదే జనం సమాధానమిస్తున్నారని అన్నారు. కెనడాలో జరిగిన ఘటనపై ప్రస్తావన వచ్చినప్పుడు మన అమ్మాయిలు హిజాబ్ ధరించబోమని హిజాబ్‌కు వ్యతిరేకంగా నిలబడ్డప్పుడు, వారు దానిని ఇరాన్ సమస్య అని పిలుస్తున్నారని గౌతమ్ ఈ సంధర్భంగా కామెంట్ చేశారు. గౌతమ్‌ మాట్లాడుతూ సనాతన సంప్రదాయాన్ని పాటించేవారు కూడా ఇప్పుడిప్పుడే చైతన్యవంతులయ్యారని అన్నారు.


అయినా మేము మరింత సహనంతో ఉన్నామని అనిపిస్తుందని అన్నారు. ఇక కాశ్మీర్ ఫైల్‌ను ప్రశ్నించిన వ్యక్తులు ఈ అంశంపై మాట్లాడకుండా ఏమి చేస్తున్నారని గౌతమ్ ప్రశ్నించారు. పసుపు రంగు మన జాతి గర్వించదగ్గ ప్రతీక అని హిందూ మతంలో పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది కానీ పసుపు రంగును సిగ్గులేని రంగుగా అభివర్ణిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు ఎవరి కోసం సినిమా తీశారో, సమాజానికి సేవ చేసే పనిలో ఉన్న మీ కూతురితో కలిసి కూర్చొని సినిమా చూడండి అని ఆయన డిమాండ్ చేశారు.


సినిమా అనేది వేల మంది ప్రజల జీవనోపాధితో ముడిపడి ఉందని మీరు దానిని సమర్థిస్తారు కానీ అలా అని మన మతాన్ని అవమానించుకోలేము కదా అని కామెంట్ చేశారు. షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన పఠాన్ సినిమాకు వ్యతిరేకంగా హిందూ సంస్థలతో పాటు ముస్లిం సంస్థలు కూడా నిరసన తెలుపుతున్నాయి.  ఈ పఠాన్ సినిమాపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాను నిషేధించాలన్న డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. పఠాన్ మూవీ నుంచి బేషరమ్ రంగ్ మొదటి పాటగా విడుదలైంది.


ఈ పాటలో సినీ నటి దీపికా పదుకొణె కుంకుమపువ్వు రంగులో ఉన్న బికినీ ఒకదాన్ని ధరించి ఉంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాటలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించి మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని ఈ సినిమా దర్శకుడిని కోరారు.


అలా చేయడంలో విఫలమైతే కనుక సినిమా విడుదలకు అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని హోంమంత్రి స్పష్టంగా చెప్పారు. అయితే నిజంగా సినిమాలో ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయనేది తెలియదు కానీ, నిజంగా నేతలు డిమాండ్ చేసినట్లు నిజంగా ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకుంటే నిజంగా తన కుమార్తెతో కలిసి సినిమా చూడగలరా? 


Also Read: Upasana Konidela Surrogacy: సరోగసీ బాటలో ఉపాసన కొణిదెల.. ఆ ఫొటోలతో అసలు మేటర్ లీక్?


Also Read: Kushi Re Release : పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ స్పెషల్.. సర్ ప్రైజ్‌ ఇచ్చిన డైరెక్టర్ ఎస్ జే సూర్య



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.