Kenneth Mitchell : కెన్నెత్ మిచెల్ కన్నుమూత..ఐదేళ్లుగా ఆ వ్యాధి తో బాధపడుతున్న కెప్టెన్ మార్వెల్నటుడు
Kenneth Mitchell: కెనడియన్ యాక్టర్ కెన్నెత్ మిచెల్ 49 సంవత్సరాల వయస్సులో అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ALS) అనే వ్యాధికారణంగా మరణించాడు. అతను కెప్టెన్ మార్వెల్‌లో జోసెఫ్ డాన్వర్స్ పాత్రలో నటించాడు.
Kenneth Mitchell Dies Of ALS: మనలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు మార్వెల్ సిరీస్ తెలియని వాళ్ళు ఉండరు. నిజానికి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయంటే మార్వెల్ సిరీస్ కి సంబంధించిన ఏ మూవీ విడుదలవుతుందా అని ఎక్సైటింగ్గా ఎదురు చూసే వాళ్ళు కూడా మనలో చాలామంది ఉన్నారు. అలాంటి అందరికీ కెప్టెన్ మార్వెల్ మూవీలో నటించిన జోసెఫ్ డాన్వర్ పాత్ర గుర్తుండే ఉంటుంది.కెప్టెన్ మార్వెల్ ..స్టార్ ట్రెక్: డిస్కవరీ.. మూవీస్ తో అతను బాగా పాపులర్ అయ్యాడు.
కెన్నెత్ కు ఈ వ్యాధి ఉన్న విషయం 2018 ప్రాంతంలో తెలిసింది. ఆ తర్వాత సంవత్సరం నుంచి అతను వీల్ చైర్ వాడే పరిస్థితి ఏర్పడింది. గత ఐదున్నర సంవత్సరం నుంచి అతను ఈ భయంకరమైన వ్యాధితో పోరాడుతూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. తన జీవితంలోని ప్రతి క్షణాన్ని ఎంతో ఆనందంగా పరిపూర్ణంగా గడపడానికే కెన్నెత్ ప్రాధాన్యత ఇచ్చేవాడట. ఈ వ్యాధి ప్రారంభ సమయంలో కాళ్లు మెలితిప్పినట్టు నొప్పి కలగడం బలహీనత కలగడం సర్వసాధారణం. ఆ తర్వాత క్రమంగా ఇది మన నాడీ వ్యవస్థ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్.. కామన్ గా ALS అని పిలిచే ఈ వ్యాధి మన మెదడు నుంచి వెన్నుపూస మధ్య ఉన్న నరాల కణాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ వ్యాధిగ్రస్తులు కాలక్రమేనా తమ కండరాలపై నియంత్రణను కూడా కోల్పోతారు. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అనేదానికి ఖచ్చితమైన కారణాలు కూడా ఇప్పటికీ తెలియలేదు. అయితే ఇది వారసత్వంగా కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
కెన్నెత్ మిచెల్ మరణించిన వార్తను అతని కుటుంబం ఇంస్టాగ్రామ్ మరియు X ద్వారా అధికారికంగా ప్రకటించింది. అలాగే “అతను తన సినీ కెరియర్లో ఇప్పటివరకు ఒక ఒలంపిక్ ఆశాజ్యోతి గా..అపోకలిప్స్ నుండి బయటపడిన వ్యక్తి గా.. ఒక సూపర్ హీరోకి తండ్రిగా.. ఒక ఆస్ట్రోనట్టుగా.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. కానీ అతనితో ఉన్నవారికి అతను ఒక ఆశావాది అన్న విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. అతనిలో ఒక డ్రీమ్ బిలీవర్, సాకర్ ప్లేయర్, బీచ్ వాకర్, బేర్ హగ్గర్, ల్యాండ్‌స్కేప్ డిజైనర్, గార్డెన్ గ్రోవర్, కానో ప్యాడ్లర్, హ్యాపీ క్యాంపర్, నేచర్ లవర్.. ఇలా ఎన్నో రూపాలు ఉన్నాయి. అన్నిటికంటే మించి అతను ఒక గొప్ప తండ్రి..”అంటూ ఒక ఎమోషనల్ నోట్ ను పోస్ట్ చేశారు.కెన్నెత్ మిచెల్ లాంటి వ్యక్తి మరణం నిజంగా హాలీవుడ్ కి ఒక తీరని నష్టం.
Read More: Cucumber: సమ్మర్ లో కీర దోసకాయలు ఎక్కువగా తింటున్నారా..?.. ఈ విషయాలు తెలుసుకొండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook