Case Filed Against Mohan Babu:`మా` గొడవలో మోహన్ బాబు.. భద్రాద్రి కొత్తగూడెంలో కేసు నమోదు
`మా` ఎన్నిలకల వేడి తగ్గింది అనుకున్నటున్న తరుణంలో మరో మారు తెరపైకి వచ్చింది. ఎన్నికల సమయంలో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలకు గానూ, గొర్రెల, మేకల కాపరి సంఘం వారు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు
Case Filed Against Mohan Babu: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (Movie Artist Association) ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం శృష్టించిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పటికీ మెగా కుటుంబం (Mega Fanily), మంచు కుటుంబం (Manchu Famnily) దూరం దూరం ఉంటున్నాయన్న వార్తలు సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.
ఎన్నికలు జరగటం... మంచు విష్ణు (Manchu Vishnu) గెలవటం, ప్రకాష్ రాజ్ (Prakash Raj) మరియు అతడి ప్యానెల్ సభ్యులు మా సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇపుడు మా ఎన్నికల గొడవలోకి మంచు విష్ణు నాన్న నటుడు మోహన్ బాబు (Mohan Babu) ఇరుకున పడ్డారని తెలుస్తుంది. ఎన్నికల సమయంలో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలకు గాను కొంత మంది కేసు పెట్టినట్టు తెలుస్తుంది.
Also Read: Owaisi Sensational Comments: మోదీకి చైనా గురించి మాట్లాడాలంటే భయం: అసదుద్దీన్ ఒవైసీ
'మా' ఎన్నికల (Maa Elections) సమయంలో సీనియర్ నటుడు, మాజీ పార్లమెంటు రాజ్యసభ సభ్యులు మోహన్ బాబు.... "ఎన్నికల్లో ఈ గొడవలేంటి..?? ఏంటి ఈ భీభత్సవం, నో ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఎవ్రీబడీ ఈజ్ అబ్జర్వింగ్… గొర్రెలు మేపుకునేవాడి దగ్గర కూడా ఫోన్ ఉంది. అందరు చూస్తున్నారు మనల్ని" అని వ్యాఖ్యానించిన సంగతి మనకు తెలిసిందే!
అయితే ఈ రోజు గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటీ కోరిన విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem) కమిటీ ఆధ్వర్యంలో మోహన్ బాబుపై కేసు పెట్టారు. గొర్రెలు, మేకలు పెంచే వారు చూస్తే మీ గౌరవం దెబ్బ తింటుందా..?? మా వృత్తిని అవమానించేలా మోహన్ బాబు వ్యాఖ్యానించారని వారు పేర్కొన్నారు.
Also Read: India Vs Pakistan Match: ఐసీసీ ప్రణాళిక ప్రకారం భారత్- పాక్ మ్యాచ్ జరగాల్సిందే: రాజీవ్ శుక్లా
అంతేకాఉండా, మేము చూస్తే సినీతారల గౌరవం దిగజారిపోతుందా..? మా వృత్తిని కించపరిచేలా మాట్లాడిన మోహన్ బాబు గారిపై చర్యలు తీసుకోవాలని బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం ఫిర్యాదు చేసింది. దీంట్లో జిల్లా అధ్యక్షులు కలికినేని తీరీష్, హాయ కార్యదర్శి బసినబోయిన గంగరాజు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి