Case Filed on Rana: రానా, సురేష్ బాబులపై కేసు నమోదు.. అసలు ఏమైందంటే?
Case Filed on Daggubati Rana: హీరో దగ్గుబాటి రానా, ఆయన తండ్రి నిర్మాత సురేష్ బాబు మీద కేసు నమోదు చేసింది నాంపల్లి కోర్టు, వారి మీద కేసు మీద నమోదు ఎందుకు అయింది అనే వివరాల్లోకి వెళితే
Case Filed on Daggubati Rana and Suresh Babu: తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దగ్గుబాటి సురేష్ బాబు ఆయన కుమారుడు హీరో దగ్గుబాటి రానా మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిలింనగర్లో దగ్గుబాటి సురేష్ బాబు ఆయన కుమారుడు రానా పేర్ల మీద కొంత ఖాళీ స్థలం ఉంది. అయితే దాన్ని దగ్గుబాటి సురేష్ బాబు రానా కలిసి ఒక వ్యాపారికి లీజుకి ఇచ్చారు. అలా ఇచ్చిన తరువాత ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ ఆ వ్యాపారిని తమ స్థలాన్ని వెనక్కిచ్చేయమని కోరారు.
అయితే లీజు గడువు ఇంకా ఉండడంతో తాను ఇవ్వనని ఆయన ఎదురు తిరిగినట్లుగా చెబుతున్నారు, దీంతో దౌర్జన్యంగా తన మనం రౌడీల సాయంతో ఖాళీ చేయించారని ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థలం కనుక ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరించారని తాను ఈ విషయం మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన కోర్టులో కేసు ఫైల్ చేశాడు, ఈ క్రమంలో పోలీసులతో సంబంధం లేకుండా నేరుగా సురేష్ బాబు, దగ్గుబాటి రానా సహా మరికొందరు మందిపై నాంపల్లి కోర్టు కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.
మూవీ మొఘల్ గా పేరు తెచ్చుకున్న దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సురేష్ బాబు సినీ రంగ ప్రవేశం చేశారు. తన సోదరుడు వెంకటేష్ హీరోగా మారి అనేక సినిమాలు చేస్తుంటే దగ్గుబాటి సురేష్ మాత్రం తండ్రి వారసత్వం అందుకొని నిర్మాతగా మారారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు రానా మాత్రం నిర్మాతగా కాకుండా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో నిర్మాతగా కూడా మారి పలు సినిమాలకు సమర్పకుడిగా కూడా వ్యవహరించారు.
అయితే వీరిద్దరి మీద ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదు కావడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సురేష్ బాబు అండర్ లో రామానాయుడు స్టూడియోస్ ఉన్నాయి అదే విధంగా విశాఖపట్నంలో కూడా రామానాయుడు స్టూడియో సురేష్ బాబు నడుపుతున్నారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ పేరుతో సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. రానా మాత్రం ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సినిమాల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వరుస సినిమాలను మాత్రం అనౌన్స్ చేయకుండా నెమ్మదిగా సినిమాలు చేస్తూ వెళుతున్నారు.
Also Read: Amigos OTT : అమిగోస్ వచ్చేది ఆ ఓటీటీలోకే.. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?
Also Read: Amigos Movie Review: కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook