Casting Call For Suriya 42 సూర్య శివ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ కాల్ ప్రకటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ కోసం కొత్త వారిని ట్రై చేస్తున్నట్టుగా ఉంది. అందుకే పాతికేళ్ల నుంచి యాభై ఏళ్ల వరకు ఉన్న మగవారు కావాలని, వారికి జుట్టు ఎక్కువగా ఉండాలని, గడ్డం, మీసం ఎక్కువగా ఉండాలంటూ చెప్పుకొచ్చారు. అలాంటి రూపు రేఖలున్న బాడీ బిల్డర్లు తమని సంప్రదించండని డైరెక్టర్ శివ టీం ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 




 


అసలే ఇప్పుడు సూర్య సినిమాలకు ఫుల్ గిరాకీ ఉంది. కరోనా సమయంలో ఎవరికైనా ఎక్కువగా క్రేజ్ వచ్చిందంటే అది సూర్యకే. ఓటీటీలో సినిమాలు వచ్చినా అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. ఆకాశం నీహద్దురా సినిమాలు, జై భీమ్ మూవీలు సూర్యను ఎక్కడో తీసుకెళ్లిపెట్టాయి. ఈ రెండు సినిమాల్లో సూర్య నటన పీక్స్‌లో ఉంటుంది. సామాజిక సందేశాన్ని ఇచ్చే చిత్రాలైనా కూడా సూర్య తన మార్క్ వేశాడు. అందరికీ కనెక్ట్ అయ్యేలా నటించేశాడు.


అయితే సూర్య నటించిన ఈటీ ఎవరికీ తలవంచకు అనే సినిమా మాత్రం దారుణంగా బెడిసి కొట్టేసింది. డిజాస్టర్‌గా నిలిచింది. అలా సూర్య సినిమాకు తెలుగులో ఓపెనింగ్స్ కూడా రాలేదు. కానీ ఇప్పుడు సూర్య లైనప్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. విక్రమ్ సినిమా చివర్లో రొలెక్స్‌గా కనిపించి అందరినీ భయపెట్టేశాడు.


ఇప్పుడు శివ తెరకెక్కిస్తోన్న ఈ 42వ సినిమా కోసం సూర్య కొత్తగా ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ క్యాస్టింగ్ కాల్ ప్రకటించారు. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉండటంతో ఇలా కొత్త వారిని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇక ఎవరికైనా సినిమాల్లో నటించాలని, కనిపించాలనే కోరిక ఉంటే ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు.


Also Read:  Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే


Also Read: SSMB 28 Look : మహేష్‌ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook