Ananth - Radhika : కోట్ల విలువ చేసి బహుమతులు కురిపించిన సెలబ్రిటీస్.. ఎవరి గిఫ్ట్ ఎంత విలువంటే..?
Ananth Ambani - Radhika.. ప్రపంచ కుబేరుడైన ముఖేష్ అంబానీ ఇటీవల తన చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహాన్ని అత్యంత ఘనంగా జరిపించిన విషయం తెలిసిందే. అనంత్ - రాధిక వివాహానికి రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు అయ్యింది. ఇక ఈ వివాహానికి వచ్చిన సెలబ్రిటీలు ఒక్కొక్కరు కోట్ల రూపాయల విలువ చేసే బహుమతులు అందించారు.
Celebrities Gifts for Ananth - Radhika: అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ల వివాహం జరిగి 10 రోజులకు పైగానే అవుతున్నా.. ఇంకా ఈ వివాహానికి సంబంధించిన ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. ఈ క్రమంలోనే అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ ఏకంగా రూ .5వేల కోట్ల ఖర్చుతో తమ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు అంతేకాదు ప్రపంచం నలుమూలలో ఉండే సెలెబ్రిటీలు ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ వివాహానికి హాజరైన సెలబ్రిటీలకు అంబానీ ఫ్యామిలీ ఒక్కొక్కరికి రూ .2కోట్ల రూపాయల విలువైన వాచ్లను బహుమతిగా అందించింది. మరి అంత ఖరీదైన బహుమతులను అందుకున్నారు కదా.. ఈ వివాహానికి హాజరైన సెలబ్రిటీలు ఈ కొత్త జంటకు ఎటువంటి బహుమతులు ఇచ్చారు..?వాటి ఎంత ఖరీదు ?అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం.
మార్క్ జుకర్ బర్గ్: ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ రూ.300 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ను బహుమతిగా అందించారు.
జెఫ్ బెజోస్: అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ రూ.11.5 కోట్ల విలువైన లగ్జరీ కారును బహుమతిగా అందించారు.
షారుక్ ఖాన్: 40 కోట్ల రూపాయల విలువైన అపార్ట్మెంట్ ను రాధిక - అనంత్ జంటకు బహుమతిగా అందించారు. ప్రస్తుతం ఈ లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్రాన్స్ లో ఉంది.
అమితాబ్ బచ్చన్ : అమితాబ్ బచ్చన్ కుటుంబం కూడా బహుమతిలో వెనుకబడలేదు. రాధికకు రూ.30 కోట్ల విలువైన పచ్చహారాన్ని బహుమతిగా అందించింది.
దీపికా పదుకొనే - రణవీర్ సింగ్: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఆమె భర్త ప్రముఖ హీరో రణవీర్ సింగ్ ఏకంగా రూ.20 కోట్ల విలువైన కస్టమైజ్డ్ రోల్స్ రాయిస్ కార్ ను బహుమతిగా అందించారు.
అలియా భట్ - రణబీర్ కపూర్: బాలీవుడ్ క్యూట్ జోడి అలియా భట్ - రణబీర్ కపూర్ కూడా రాధిక - అనంత్ జంటకు రూ .9 కోట్ల విలువైన మెర్సిడెస్ కారును బహుమతిగా అందించారు.
కత్రినా కైఫ్ విక్కీ కౌశల్: ఈ జంట రూ.19 లక్షల విలువైన బంగారు హారం అందించారు.
కియారా అద్వానీ - సిద్ధార్థ మల్హోత్రా: కియారా- సిద్ధార్థ మల్హోత్రా రూ.25 లక్షల విలువైన చేతితో నేసిన శాలువా బహుకరించారు.
ప్రస్తుతం ఈ సెలబ్రిటీలు ఇచ్చిన బహుమతులు చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Shamshabad Airport: ఎంతైనా డబ్బులిస్తామయ్యా ఫ్లైట్ ఎక్కించు.. శంషాబాద్‌లో ప్రయాణికుల గొడవ
Also Read: Windows Outage: ఒక్క సమస్యతో ప్రపంచం అతలాకుతలం.. స్తంభించిన ఎయిర్‌లైన్స్, బ్యాంకింగ్, టెలికాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter