Jhulan Goswami Biopic: బాలీవుడ్ లో మరో బయోపిక్ రానుంది. నటి అనుష్క శర్మ (Anushka sharma) లీడ్ రోల్ లో భారత మహిళ జట్టు మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి(Jhulan Goswami) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’‌ (Chakda Xpress).  దాదాపు మూడేళ్లు తర్వాత అనుష్క రీఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను అనుష్క రిలీజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత జట్టుకు ప్రధాన బౌలర్‌గానే కాకుండా ఎన్నో సేవలందించిన జులన్ గోస్వామి పాత్రలో అనుష్క నటిస్తున్నారు. టీమ్‌ఇండియా క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో జులన్  ఎటువంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎన్ని కష్టాలను చవిచూశారనే కథాంశంతో వాస్తవిక పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని అనుష్క, ఆమె సోదరుడు కర్నేశ్‌ శర్మ నిర్మిస్తుండగా, ప్రాసిత్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని  ప్రముఖ  ఓటీటీ(OTT) ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) విడుదల చేయనున్నారు. 


Also Read: Pushpa OTT Deal: పుష్ప ఓటీటీ రిలీజ్ కోసం అమెజాన్ ప్రైమ్ డీల్ ఎంతంటే?


''ఇది నిజంగా స్పెషల్ సినిమా. ఎన్నో త్యాగాలకోర్చిన అద్భుతమైన కథ. చక్‌దే ఎక్స్‌ప్రెస్‌ సినిమా.. టీమ్‌ఇండియా మహిళల జట్టు మాజీ సారథి జులన్ గోస్వామి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. మహిళల క్రికెట్‌లో ఇది ఒక కనువిప్పు కలిగే చిత్రంగా నిలుస్తుంది. ’ అని అనుష్క  ట్వీట్ చేశారు. అయితే ఇప్పటికే టీమ్‌ఇండియా మహిళల క్రికెట్‌లో మిథాలీరాజ్‌ బయోపిక్‌ (Mithali Raj Biopic) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాప్సీ లీడ్ రోల్ లో నటిస్తున్నారు.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook