Chalapathi Rao Cried at MAA Elections Says Karate Kalyani: అనూహ్యంగా తెలుగు సినిమాకు చెందిన సీనియర్ నటులు అందరూ కన్నుమూస్తూ రావడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఇక తాజాగా నటుడు చలపతి రావు కార్డియాక్ అరెస్ట్ కావడంతో కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోగా ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా నటి కరాటే కళ్యాణి ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఫేస్బుక్ వేదికగా ఆమె ఒక సుదీర్ఘ పోస్టు పంచుకుంది. ‘’తెల్లవారితే భయం పట్టుకుంది మళ్ళీ ఎలాంటి వార్తా వినాలో అని.. చలపతి రావు గారు ఈపేరు అందరికీ పరిచయం, విలక్షణ నటుడు మాట కరకు, మనసు వెన్న. ఇద్దరు పిల్లలు, చిన్నప్పుడే భార్య చనిపోతే వాళ్ళని ప్రయోజకులు చెయ్యడం కోసం ఎంతమంది చిన్న వయసు కదా పెళ్ళి చేసుకోవాలని చెప్పినా .. వారి కోసం జీవితం  త్యాగం చేసిన ఒక గొప్ప తండ్రి’’ అని ఆమె పేర్కొన్నారు.


నేను వచ్చిన కొత్తలో వారిని చూసి భయం వేసింది ఎందుకంటే వారు చాలా మాటలు ఏవేవో మాట్లాడేవారు, నేనే కాదు అమ్మయిలు ఎవరూ ఆయనతో మాట్లాడే సాహసం చెయ్యరు. ఆయన నోటికి భయపడి, తరువాత ఒకసారి నేను నానక్ రామ్ గూడాలో పాట పాడుతున్నా, ఆయన వచ్చి పక్కన నిలబడ్డారు సెట్లో..పాట విని నాకు ఏంటే కళ్యాణి సినిమాల్లో పాడు బాగుంది గొంతు అన్నారు. నేను పారిపోవాలని ప్రయత్నం ఆయనను చూసి.


అప్పుడు మిగిలిన ఆర్టిస్టులు మంచి మనిషి భయపడకు, అని బాబాయ్ ఇలా అమ్మాయిలను ఏమాట పడితే ఆ మాట అనకు అని ఆయనతో అంటే నవ్వి ఈవీవీ సత్యనారాయణ గారు సినిమాలో వేషం ఉందని చెప్పారు.’’ ఒకసారి ఆఫీసులో కలువు వెళ్ళి అని..చెప్పి వేషం ఇప్పించారు. ఆ తరువాత మా జయక్క వాళ్ళు మద్రాస్ నుంచి వచ్చేస్తున్నారు అనగానే వారి అపార్ట్ మెంట్లో కనిపించారు. ఆమెతో రెగ్యులర్ గా వారి ఇంటికి వెళ్ళిన ప్రతిసారి కలిసే వాళ్ళం. మొన్న ‘మా’ ఎలక్షన్ సమయంలో వారు వచ్చినప్పుడు మమ్మల్ని అందరిని చూసి కంట నీరు పెట్టుకున్నారు.


ఆయనలో అప్పుడు బాధ చూసాం, ఇక మీ అందరినీ మళ్ళీ చూస్తానో లేదో అని అన్నారు. అంతటి  మనిషి ఆయన కాలు నడవనివ్వడం లేదు అమ్మాయి అని వీల్ చైర్లో కూర్చుని వస్తుంటే ఒక గంభీరం అయిన విలన్ పాత్రలో భయపెట్టిన ఆయన ఇలా అందరినీ చూడాలని వచ్చాను అని చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే మా అందరూ కూడా కంటనీరు పెట్టుకున్నామని అన్నారు.


బాబాయ్ మేము ఉన్నాం మీకోసం అని అనుంటుంటే ఎప్పుడూ ఒంటరినే ఇప్పుడు అంతే ఆన్న అయన మాటలు ఇంకా నిన్న అన్నట్టే ఉన్నాయి. ఇంతలో కైకాల గారి వార్త విన్న చలపతి రావు గారు తెల్లవారి గుండెపోటుతో మరణించడం బాధాకరం. పరిశ్రమలో ఉన్న పెద్ద తలకాయలు వదిలి వెళ్లిపోతుంటే మౌనంగా మనసు ఏడుస్తోంది. ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ఓం శాంతి, మీరు మా మధ్య లేరు కానీ మి జ్ఞాపకాలు మాతో పాటు ఉన్నాయి అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. 


Also Read: Chalapathi Rao: చలపతి రావు జీవితమంతా విషాదాలే.. ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నారట!


Also Read: Chalapathi Rao: బుధవారం నాడు అంత్యక్రియలు.. అప్పటిదాకా మృతదేహం అక్కడే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.