Chalapathi Rao Died After Eating Chicken Biryani: టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు మరణంతో టాలీవుడ్ మరోసారి విషాదంలో మునిగినట్లయింది. ఆయన ఈ తెల్లవారుజామున మరణించారని కొన్ని వార్తలు, లేదు నిన్న రాత్రి మరణించారని కొన్ని వార్తలు వస్తూ ఉండడంతో ఈ విషయం మీద ఆయన కుమారుడు దర్శక నిర్మాత, నటుడు రవిబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. అసలు చలపతి రావు ఎలా చనిపోయారు అనే విషయాన్ని మీడియా ముందు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన తండ్రి చలపతిరావు మరణం చాలా ప్రశాంతంగా సాగిందని రవిబాబు వెల్లడించారు. సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ నాన్నను బాబాయిని ముద్దుగా పిలుస్తూ ఉంటారని ఆయన కూడా అందరితో అంతే సరదాగా జోక్స్ వేస్తూ మాట్లాడే వారని అన్నారు. అలా ఉండబట్టే నేమో సరదాగా ఎలాంటి నొప్పి లేకుండా ప్రశాంతంగా చనిపోయారని రవిబాబు పేర్కొన్నారు. చలపతిరావు నిన్న రాత్రి భోజనం చేసే వరకు బాగానే ఉన్నారని చికెన్ బిర్యాని, చికెన్ కూర తిని ఆ ప్లేట్ ఇలా ఇచ్చి వెనక్కి వాలిపోయారని అన్నారు.


అప్పుడే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని రవిబాబు పేర్కొన్నారు. చలపతిరావు సినీ పరిశ్రమలో ఎంతో మందికి మంచి చేశారని ఆ విషయం నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తెలిసిందని రవి బాబు చెప్పుకొచ్చారు. అంతమందికి మంచి చేయబట్టేనేమో ఇంత ప్రశాంత మరణం సంభవించిందని రవిబాబు అభిప్రాయపడ్డారు. అంత్యక్రియలు ఈరోజే చేద్దామని అనుకున్నాం కానీ మా చెల్లెళ్లు ఇద్దరూ అమెరికాలో చిక్కుకుపోయారు, టికెట్లు దొరకపోవడంతో వాళ్ళు మంగళవారం రాత్రి ఇక్కడికి వస్తారు అని అన్నారు.


మంగళవారం వరకు మహాప్రస్థానంలో ఫ్రీజర్ లో నాన్న పార్థివదేహాన్ని ఉంచుతామని అన్నారు. ఇక బుధవారం నాడు ఆయన అంత్యక్రియలు చేస్తామని రవిబాబు వెల్లడించారు. నాన్నకు రామారావు గారు, ఆహారం, హాస్యం అనే మూడు చాలా ఇష్టమని అందుకే అందరినీ ఎప్పుడూ నవ్విస్తూ ఉండడానికి ప్రయత్నించేవారు అని అన్నారు.


అలా ఉండబట్టే ఇప్పుడు ఒక్క క్షణంలో ఎలాంటి బాధ అనుభవించకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని అన్నారు. నేను తీస్తున్న కొత్త సినిమాలో ఆయన చివరిగా నటించాలని, ఐదు రోజులు క్రితమే షూటింగ్లో ఆయన పాల్గొన్నారు. అదే ఆయనకు చివరి సినిమాగా నిలవబోతుందని రవి బాబు చెప్పుకొచ్చారు.


Also Read: Nabha Natesh Hot Photos: పొట్టిబట్టల్లో నభా నటేష్ హాట్ ట్రీట్..ఒక రేంజ్లో రెచ్చిపోయిందిగా!


Also Read: Tunisha Sharma Suicide: 'అన్నిటికన్నా ప్రేమే ఎక్కువ' టాటూ వేయించుకున్న తునీషా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.