Chandrababu Naidu and Pawan Kalyan in Unstoppable: నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు రాజకీయ వేత్తగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. అంతే కాదు ఇప్పుడు హోస్ట్ గా కూడా మారిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వేదికగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అంటూ ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో హీరోలను  హీరోయిన్లను ఇంటర్వ్యూలు చేస్తూ పలు విషయాలను అభిమానులకు తెలిసేలా చేస్తూ ఉంటారు. బాలయ్య ఈ షో ప్రారంభించినప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా  ఆ తర్వాత ఆయనలోని టాలెంట్ ని చూసి అందరూ ఫిదా అయిపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలుగవ సీజన్ కి సిద్ధం అయ్యింది.  సీజన్ ఫోర్లో బాలయ్య ముందు కూర్చునేది ఎవరు..? ఏ సినిమా ప్రమోషన్స్..? అంటూ జోరుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఈ సీజన్ కి ప్రత్యేక ఆకర్షణగా ఉండే విధంగా ఒక స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


ఇప్పటికే గత సీజన్లో రాజకీయ నాయకులను కూడా బాలయ్య తీసుకొచ్చారు.  ముఖ్యంగా గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు నాయుడుని అన్ స్టాపబుల్ షో కి తీసుకొచ్చి చిట్ చాట్ చేసిన విషయం తెలిసిందే .అలాగే పవన్ కళ్యాణ్ తో కూడా ఆయన ఒక ఎపిసోడ్ చేశారు.  త్వరలో ప్రారంభం కాబోతున్న సీజన్ ఫోర్లో ఇప్పుడు ఈ ఇద్దరిని కలిపి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 


Also Read: AP Cadre IAS: ఆంధ్రప్రదేశ్‌కు మేం వెళ్లలేం.. మళ్లీ కోర్టును ఆశ్రయించిన ఐఏఎస్‌లు


 పైగా వీరిద్దరూ ఇప్పుడు అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు  ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఈ షో కి ఆహ్వానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో  చాలా హల్చల్ చేస్తోంది. 


ఒకవేళ బాలకృష్ణ గట్టిగా తలుచుకుంటే ఖచ్చితంగా ఈ ఇద్దరు అన్ స్టాపబుల్ షో కి రావడం ఖాయం అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.  ఇక వీరిద్దరూ షో కి వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి  జరుగుతున్న సంక్షేమం గురించి చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.


Also Read: IAS Officers: ఆమ్రపాలితో సహా ఆ ఐఏఎస్‌లకు భారీ షాక్‌.. మొట్టికాయలు వేసిన క్యాట్‌



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి