Chandramukhi 2 First Single: ‘చంద్రముఖి-2’ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
Chandramukhi 2 Update: రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘చంద్రముఖి-2’. బాలీవుడ్ స్టార్ కథానాయిక కంగనా రనౌత్ టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Chandramukhi 2 First Lyrical Song Released: కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్(Raghava Lawrence), బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranaut) లీడ్ రోల్స్ చేస్తున్న చిత్రం ‘చంద్రముఖి-2’(Chandramukhi 2). 2005లో వచ్చిన ‘చంద్రముఖి’ (Chandramukhi) చిత్రానికి సీక్వెల్ గా దీనిని తెరకెక్కిస్తున్నారు. సీనియర్ దర్శకుడు పి.వాసు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వినాయక చవితికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్ ను సినిమాపై వీర లెవల్లో అంచనాలను పెంచేశాయి.
తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేసింది చిత్రయూనిట్. ‘స్వాగతాంజలి…’ అంటూ సాగే ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించగా.. శ్రీనిధి తిరుమల అలపించారు. ఈ సాంగ్ లో చంద్రముఖి అందం, డ్యాన్స్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో వడివేలు, లక్ష్మీమీనన్, విష్నేుష్, సృష్టి డాంగే, మహిమా నంబియార్, రావు రమేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్షా కృష్ణన్ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించడం విశేషం. సినిమాటోగ్రాఫర్ గా ఆర్.డి. రాజశేఖర్ పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీ కోసం తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్ గా, ఆంథోని ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరులో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
చంద్రముఖి-1లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించగా.. జ్యోతిక, ప్రభు, నయనతార, వినీత్, నాజర్, సోనూసూద్ ఇతర కీలకపాత్రల్లో నటించారు. విద్యా సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి కూడా పి. వాసునే దర్శకుడు. ఈ సినిమా రజినీ కెరీర్ లో సాలిడ్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో జ్యోతిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ నుంచే ఆమె కెరీర్ దూసుకుపోయింది. మరోవైపు నయనతారకు ఈ చిత్రంలో నటించిన తర్వాతే తెలుగులో ఆఫర్లు వచ్చాయి. ఈ మూవీని మలయాళంలో వచ్చిన 'మణిచిత్రతాయు' ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు.
Also Read: Adipurush OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'ఆదిపురుష్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook