Young talent: ఆర్జీవీని ఫిదా చేసిన సాంగ్.. క్రియేటివిటీ అద్భుతం
కరోనా వైరస్‌ను నియంత్రించడం కోసం కేంద్రం విధించిన లాక్ డౌన్‌ను తప్పనిసరిగా పాటించాల్సిందిగా కోరుతూ అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టన్సింగ్ వంటి నిబంధనలను పాటించి కరోనాను తరిమికొట్టాల్సిందిగా ప్రముఖులు సందేశాలతో కూడిన వీడియోలు విడుదల చేసి జనంలో అవగాహన కల్పిస్తున్నారు.
కరోనా వైరస్‌ను నియంత్రించడం కోసం కేంద్రం విధించిన లాక్ డౌన్‌ను తప్పనిసరిగా పాటించాల్సిందిగా కోరుతూ అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టన్సింగ్ వంటి నిబంధనలను పాటించి కరోనాను తరిమికొట్టాల్సిందిగా ప్రముఖులు సందేశాలతో కూడిన వీడియోలు విడుదల చేసి జనంలో అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో సాధారణ యువత సైతం లాక్ డౌన్‌పై అవగాహన కల్పిస్తూ కొంత క్రియోటివిటీని జోడించి తమదైన రీతిలో వీడియోలను రూపొందించి విడుదల చేస్తున్నారు. అలా ధనరాజ్ మోపుర్, శ్రీరాజ్ నీలేష్ అనే ఇద్దరు యువకులు కలిసి ఇప్పటికే ఫేమస్ అయిన చేయి చేయి కలపకురా అనే పాటపై రూపొందించిన కవర్ సాంగ్ నిజంగానే వావ్ అనిపించేలా ఉంది. Also read: చైనాకు ఏ పాపం తెలియదు: రామ్ గోపాల్ వర్మ
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ సాంగ్‌ని వీక్షించిన రాంగోపాల్ వర్మ.. ఆ యువకుల క్రియేటివిటీకి ఫిదా అయ్యాడు. ట్విటర్ ద్వారా వారిని ప్రశంసించిన ఆర్జీవి.. క్రియేటివిటినీ లాక్ డౌన్ అణిచేయలేదని మీరు నిరూపించారని ట్వీట్ చేశాడు. అంతేకాకుండా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా లేని ప్రొడక్షన్ వ్యాల్యూస్, వినోదం జీరో బడ్జెట్‌తో ఇంట్లో తీసిన మీ వీడియోలో ఉందని కితాబిచ్చాడు. Also read : హీరోయిన్‌కి ఆన్‌లైన్ క్లాసెస్
ఈ సాంగ్ రూపొందించిన వారిని కలవాలనుంది అని వర్మ ట్వీట్ చేయడం.. వర్మ ట్వీట్ చూసి ఆనందంలో తబ్బుబ్బయిన సదరు యంగ్ టాలెంట్స్ వెంటనే వర్మ ట్వీట్‌కి స్పందించడం, ఫోన్ నెంబర్ ఇవ్వడం సైతం జరిగిపోయాయి. వాళ్ల ట్వీట్ చూసిన వర్మ.. తప్పకుండా త్వరలోనే కలుద్దామని రిప్లై ఇచ్చాడు.
ఇంకేం... వర్మ లాంటి ఫిలింమేకర్ కంట్లోపడ్డాక ఏదో ఓ రోజు సినిమా అవకాశం కూడా వాళ్ల తలుపు తట్టకపోతుందా. ఆల్ ది బెస్ట్ గైస్.. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..