Chinmayi Fires on Memers : కొబ్బరి బోండాల వీడియో.. తెలుగు మీమర్స్ మీద చిన్మయి మండిపాటు
Chinmayi Sripada Fires on Telugu Memers సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. మహిళలను కించపరుస్తూ వచ్చే వీడియోల మీద చిన్మయి ఎప్పటికప్పుడు మండి పడుతూనే ఉంటుంది. మహిళల ప్రైవేట్ పార్టుల మీద వచ్చే మీమ్స్, ట్రోల్స్ మీద ఫైర్ అవుతుంటుంది.
Chinmayi Sripada Fires on Telugu Memers సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్టు అయిన చిన్నయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మీటూ ఉద్యమం మొదలు అయినప్పటి నుండి కూడా ఈమె పేరు రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఈమెను విమర్శించే వారు ఉన్నారు.. ప్రశంసలతో ముంచెత్తే వారూ ఉన్నారు. తనను ఎవరు ఏమని విమర్శించినా... భౌతిక దాడులకు దిగినా కూడా తన పద్దతి మార్చుకోకుండా.. తాను అనుకున్నది చెప్పందుకే సిద్ధం అన్నట్లుగా ఈమె ముందుకు సాగుతుంది.
ఇటీవల విరాట్ కోహ్లీ అనుష్క కూతురు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై తీవ్ర స్థాయిలో మండి పడుతూ వ్యాఖ్యలు చేసిన చిన్నయి మరోసారి సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. తాజాగా ఓ చెత్త వీడియో మీద, ద్వందార్థాలు వచ్చే ఓ వీడియో మీద స్పందించింది. ఒక తెలుగు మీమర్ కొబ్బరి బోండాలతో కూడిన ఒక చెత్త వీడియోను షేర్ చేశాడు. అందులో కొట్టిన కొబ్బరి బోండాను చూపిస్తూ రేటు చెబుతూ వచ్చాడు. ఆ వీడియో మహిళలను అగౌరవ పర్చే విధంగా ఉంది.
చిన్మయి ఆ వీడియోను షేర్ చేసి తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది. తెలుగు మీమర్స్ అప్పుడప్పుడు ఇలాంటి శృతి మించే మీమ్స్ చేస్తున్నారంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది. అంతే కాకుండా నువ్వు ఒక తల్లికి జన్మించావు అనే విషయాన్ని గుర్తుంచుకో.. ఇలా రేటు కట్టడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అంటూ తీవ్రంగా స్పందించింది. మీమర్స్ తీరును సోషల్ మీడియా ద్వారా నేరుగా ఇలా ఎండగట్టడంను జనాలు కొందరు అభినందిస్తున్నారు.
[[{"fid":"270595","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
నీచమైన చెత్తతో మహిళల యొక్క ప్రైవేట్ పార్ట్స్ ను పోల్చుతూ రేటు కట్టిన ఆ మీమర్స్ ను బ్లాక్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. చిన్మయి ఇలాంటి వీడియోల గురించి స్పందించడంను కొందరు తప్పుబడుతున్నారు. ఇలాంటి వీడియోలను షేర్ చేసి వారికి పబ్లిసిటీ కల్పించడం తప్ప మరేం లేదు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి వారిని చిన్మయి వంటి వారు కూడా సోషల్ మీడియా ద్వారా విమర్శించకుంటే ఎవరు విమర్శిస్తారు అంటూ మరి కొందరు ఆమె తీరును ప్రశంసిస్తున్నారు.
ఆడవారి విషయంలో ఏ తప్పుడు పోస్ట్ కనిపించినా కూడా చిన్మయి వెంటనే స్పందించడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి రోజు ఏదో ఒక ఇష్యూ పై ఆమె స్పందించడం నిజంగా అభినందనీయం. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి వారు స్పందించడం వల్లే జనాల్లో అవగాహణ కలుగుతుందని.. ఆడవారి పట్ల చెడుగా ప్రవర్తించే వారికి తగిన బుద్ది చెప్పే అవకాశం ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook