ప్రముఖ బాలీవుడ్ (Bollywood) టీవీ సీరియల్ నటుడు సిద్ధార్థ్ శుక్లా (Sidharth Shukla) ఈ రోజు ఉదయం గుండె పోటుతో మరణించారు. "చిన్నారు పెళ్లి కూతురు" (Chinnari Pelli Kuthuru) సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. అంతేకాకుండా బాలీవుడ్ బిగ్‌బాస్‌ -13 (Bigg Boss 13) సీజన్ లో గెలిచి చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


40 ఏళ్ల  వయసు గల సిద్ధార్థ్ శుక్లా తన తల్లి, ఇద్దరు చెల్లెళ్లతో  నివాసం ఉంటున్న ఈ బాలీవుడ్ నటుడు ఈ రోజు ఉదయం గుండెపోటు రావటంతో చికిత్స కోసం "కూపర్ హాస్పిటల్" (Cooper Hospital) తరలించగా ,చికిత్స పొందుతుంగా మరణించటం బాధాకరం. ఈ యువ నటుడి మరణంతో సినీ సెలబ్రెటీ లు ట్విట్టర్ లో తమ సంతాపం తెలుపుతున్నారు.


1980 డిసెంబర్‌ 12న అశోక్‌-రీతా శుక్లా దంపతులకు సిద్దార్థ్‌ జన్మించారు. ఇంటీరియర్‌ డిజైన్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన ఆయన సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 'జానే పెహచానే సే', 'యే అజ్‌నబీ', 'లవ్ యు జిందగీ లాంటి' సీరియల్స్‌లో నటించాడు. ముఖ్యంగా పాపులర్‌ టీవీ సీరియల్‌ 'బాలికా వధు’ (Bhalika vadhu) ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు. 2014లో కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించిన హంప్టీ శర్మకి దుల్హానియాతో (Humpty Sharma Ki Dulhania) బాలీవుడ్‌కీ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన చివరిగా కనిపించిన షో ‘బ్రోకన్‌ బట్‌ బ్యూటీఫుల్‌ 3’.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook