Chiranjeevi Dance With 200 Members మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ డ్యాన్సుల గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరూ తెరపై స్టెప్పులు వేస్తే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. ఇక ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే స్టెప్పులు వేశారు. అయితే ఇప్పుడు తమ తమ సినిమాల కోసం చిరు, చరణ్‌లు అదిరే రేంజ్‌లో స్టెప్పులు వేయబోతోన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామ్ చరణ్‌ అయితే శంకర్ సినిమా కోసం పాట చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఐదు వందల మంది డ్యాన్సర్లతో ఆ పాటను శంకర్ ప్లాన్ చేశాడట. ఒక్కో పాటకు శంకర్ పెడుతున్న కోట్ల ఖర్చుని చూసి అంతా షాక్ అవుతున్నారు. ఆల్రెడీ ముందు అనుకున్న బడ్జెట్‌ను మించిపోయిందని టాక్. అయినా శంకర్ మాత్రం వెనక్కి తగ్గడం లేదట.


ఇక చిరంజీవి ఇప్పుడు భోళా శంకర్ సినిమా కోసం పాటను షూట్ చేయబోతోన్నారట. ఈ సాంగ్‌కు శేఖర్ మాస్టర్ తన స్టైల్లో కంపోజ్ చేస్తున్నాడట. ఈ పాట కోసం రెండు వందల మందిని తీసుకుంటున్నారట. ఈ పాటను భారీ ఎత్తున షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మేకర్లు అధికారికంగా ఓ ట్వీట్ వేశారు.


వేదాళం సినిమాకు రీమేక్‌గా ఈ సినిమాను తీస్తోన్న సంగతి తెలిసిందే. అజిత్ వేసిన పాత్రను ఇక్కడ చిరంజీవి చేస్తున్నాడు. చెల్లి పాత్ర కోసం కీర్తి సురేష్ రాగా.. హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సమ్మర్‌ కానుకగా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాతో అయినా మెహర్ రమేష్ హిట్ కొడతాడేమో చూడాలి.


శక్తి, షాడో వంటి డిజాస్టర్లను తీసిన తరువాత ఇప్పటి వరకు ఇంకో సినిమాను దక్కించుకోలేకపోయాడు మెహర్ రమేష్. ఇక చిరంజీవి ఇచ్చిన ఈ అవకాశాన్ని మెహర్ రమేష్‌ సద్వినియోగం చేసుకుంటాడా? లేదా? అన్నది చూడాలి. పవన్ కళ్యాణ్‌, చిరంజీవిలు ఇలా రీమేక్ సినిమాలు తీస్తూ ఉండటంపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. వినోదయ సిత్తం రీమేక్‌ను అందరూ వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే.


Also Read:  Ashu Reddy : జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం!.. అషూ రెడ్డి ముదురు కామెంట్లు


Also Read: Kiara Advani Wedding Pics : కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి.. రామ్ చరణ్ కామెంట్ ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook