Waltair veerayya set : చిరంజీవి, బాబీ కాంబోలో వాల్తేరు వీరయ్య అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశీ రౌతేలాను తీసుకొచ్చారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ సెట్‌లో మాస్ సాంగ్‌ షూటింగ్ జరుగుతోంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. అసలే ఈ చిత్రం కోసం రెండు పాటలను శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తున్నాడట. ఈ విషయాన్ని బాబీ చెప్పుకొచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీ సెట్‌లో శేఖర్ మాస్టర్, మెహర్ రమేష్‌ల బర్త్ డేలను చిరంజీవి సెలెబ్రేట్ చేశాడట. ఇద్దరితో కేక్ కట్ చేయించిన ఫోటోలు ఇప్పుడు వైరల్అవుతున్నాయి. ఇందులో చిరంజీవి, తన వాల్తేరు వీరయ్య టీం అంతా కూడా సందడిగా కనిపిస్తున్నారు. ఇక ఇద్దరి బర్త్ డేలు ఒకే రోజు అవ్వడంతో ఇలా సెలెబ్రేట్ చేసేశారు.స


వాల్తేరు వీరయ్య సెట్‌లో జరిగిన ఈ బర్త్ డే సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక స్వయంగా చిరంజీవి ఇలా సర్ ప్రైజ్ ఇవ్వడంతో శేఖర్ మాస్టర్‌కు మాటల్లో చెప్పలేని ఆనందం వేసినట్టుగా ఉంది. చిరు మీద తనుకున్న ప్రేమను పోస్ట్ ద్వారా తెలిపాడు.


 



శేఖర్ మాస్టర్ వేసిన ఈ పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. నా జీవితంలో ఇది మరిచిపోలేని పుట్టిన రోజు.. దీన్ని నా జీవితంలో ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను.. ఎంతో సంతోషంగా అనిపిస్తోంది.. గొప్ప అనుభూతిని ఇచ్చింది..  చిరంజీవి సర్, బాబీ సర్, మైత్రీ టీంకు థాంక్స్.. మెహర్ రమేష్‌ సర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.

Also Read : Pooja Hegde Leg Injury : పూజా హెగ్డే కాలికి గాయం.. కోలుకుంటోన్న బుట్టబొమ్మ.. పిక్ వైరల్


Also Read : Alia Bhatt Blessed with Baby Girl : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అలియా భట్.. ఆనందంలో రణ్‌బీర్ కపూర్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook