Chiranjeevi Happy Tears at Waltair Veerayya Success Event: ఒకప్పుడు సినిమాలకు రచయితగా పనిచేసిన బీవీఎస్ రవి తర్వాత జవాన్ సినిమాతో దర్శకుడిగా వాంటెడ్ సినిమాతో దర్శకుడిగా మారాడు. అయితే ఆ సినిమా కలిసి రాకపోవడంతో జవాన్ అనే సినిమా కూడా చేశారు. ఆ సినిమా కూడా పెద్దగా కలిసి రాకపోవడంతో మళ్లీ రచయితగా కొనసాగుతూనే సినిమాలకు దూరమవ్వకుండా నటన మీద కూడా దృష్టి పెట్టారు. ఇటీవల ఆయన ధమాకా సినిమా సహా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాల్లో కూడా కనిపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలోనే వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ ఈవెంట్ లో భాగంగా బీవీఎస్ రవి మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా సాగాయి. బీవీఎస్ రవి మాటలకు మెగాస్టార్ చిరంజీవి కంట కన్నీరు కూడా కనిపించింది. బీవీఎస్ రవి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి స్థాయి ఎలాంటిది? ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది? అనే విషయాలను ప్రేక్షకుల ముందుకు మరోసారి ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అలా బీవీఎస్ రవి మాట్లాడుతున్న సమయంలో మెగాస్టార్ కంట కన్నీరు కనిపిస్తూ ఉండడంతో ఆయన అభిమానులు అంతా ఆవేదన వ్యక్తం చేశారు.


అయితే తన గురించి అత్యద్భుతంగా మాట్లాడుతున్న బివిఎస్ రవిని చూసి మెగాస్టార్ అలా కన్నీరు పెట్టుకొని ఉండవచ్చని అంటున్నారు. ఇక వరంగల్ వేదికగా జరిగిన విజయోత్సవ సభకు మెగాస్టార్ చిరంజీవి కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా రామ్ చరణ్ కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడమే కాదు ఆ ఈవెంట్ కి హాజరైన అందరిలోనూ జోష్ నింపే ప్రయత్నం చేశారు. అయితే బీవీఎస్ రవి మాటలకు మెగాస్టార్ కన్నీరు పెట్టుకోవడం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్ కన్నీరు పెట్టుకుంటున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ మనసు అంటే ఇదని, ఆయనది పసి మనసు అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


Also Read: Waltair Veerayya Success Event : వాల్తేరు వీరయ్య సక్సెస్ ఈవెంట్లో తొక్కిసలాట.. తీవ్ర గాయాలు?


Also Read: Ram Charan counter: ఆయన్ని ఏమన్నా అంటే ఆయన ఊరుకుంటారేమో, వెనకాల ఉండే మేము ఊరుకోం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook