అలనాటి హీరోయిన్లతో మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులేశారు. మీరు చదివింది నిజమే.! 80 దశకాల్లో తారలతో  చిరు ఆడిపాడారు. ఈ కార్యక్రమం గతేడాది నాటిది. ఆయన కొత్త ఇంట్లోకి మారిన సందర్భంగా 80 దశకాల్లో హీరోయిన్లను ఆహ్వానించారు. అప్పటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనావైరస్ లాక్ డౌన్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికే పరిమితమయ్యారు. ఎలాంటి బిజీ షెడ్యూల్స్ లేవు ..కాబట్టి.. ఆయన   సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉన్నారు.  రోజూ ఏదో ఒక వీడియోను షేర్ చేస్తూ.. అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు మెగాస్టార్. ఇప్పుడు కూడా అలనాటి తారలతో ఆయన ఆడి పాడిన వీడియోను పంచుకున్నారు. అది అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..