Trisha: మన్సూర్ అలీ ఖాన్ విషయంలో త్రిషకు మద్దతుగా నిలిచిన చిరంజీవి..
Chiranjeevi supports Trisha: మన్సూర్ అలీఖాన్ త్రిష పైన చేసిన వ్యాఖ్యలపై ఎంతోమంది ఇప్పటికే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సైతం త్రిష ని సపోర్ట్ చేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ లో వేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Chiranjeevi: గత కొద్దిరోజులుగా తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ చాలా సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ చేశాను.. అలాంటి సీన్ లియోలో త్రిష తో కూడా ఉంటుంది అనుకున్న కానీ లేకపోవడంతో బాధపడ్డాను అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో సంచలనంగా మారాయి. ఎంతోమంది తమిళ సెలబ్రిటీస్ తెలుగు సెలబ్రిటీస్ దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా ముందుగా ఈ విషయంపై త్రిష స్పందించింది.
దీనిని త్రీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళలని ద్వేషిస్తున్నట్టు ఈ వ్యాఖ్యలు ఉన్నాయి... ఇలాంటి వాళ్ళతో కలిసి నాకు సినిమాలో సీన్స్ లేనందుకు నేను సంతోషిస్తున్నాను అని తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పెద్ద పోస్ట్ చేసింది. ఇక త్రిషకు మద్దతుగా లియో దర్శకుడు లోకేష్ కానగరాజ్,మాళవిక, చిన్మయి, నితిన్.. ఇలా చాలా మంది సెలబ్రిటీస్ ట్వీట్స్ చేస్తూ మన్సూర్ పై విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో చిరంజీవి కూడా ఈ విషయంపై స్పందిస్తూ త్రిషా కి మద్దతు ఇవ్వడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. చిరంజీవి, త్రిష కలిసి స్టాలిన్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక తన హీరోయిన్ పై జరిగిన ఈ విషయం గురించి స్పందించారు చిరంజీవి.
చిరంజీవి తన ట్వీట్ లో.. త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఒక ఆర్టిస్ట్ కి మాత్రమే కాదు ఏ స్త్రీని అనడానికి అయినా అసహ్యంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. వక్రబుద్ధితో ఇలాంటివి మాట్లాడుతున్నారు. త్రిషకు మాత్రమే కాదు… ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయికి వచ్చినా నేను అండగా, సపోర్ట్ గా నిలబడతాను అని రాసుకొచ్చారు.
కాగా ఇప్పటికే మన్సూర్ అలీఖాన్ పై తీవ్ర చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. మరి ఈ వివాదం ఇంకెక్కడివరకు వెళ్తుందో చూడాలి. కాగా ఈ విషయంపై మన్సూర్ నిన్న ఒక పోస్ట్ వేసినా అందులో ఆయన పశ్చాతాప పడినట్లు కనిపి లేదని అందరూ అంటున్నారు.
Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే
Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook