Gang Leader Re Release Postponed గతంలో వచ్చిన క్లాసిక్ హిట్లను ఇప్పుడు రీ రిలీజ్ చేసి సొమ్ము చేసుకోవాలని మేకర్లు అనుకుంటున్నారు. స్టార్లకు ఉన్న క్రేజ్‌ను వాడుకుందామని అనుకుంటున్నారు. కానీ అది అన్ని సార్లు వర్కౌట్ అవ్వడం లేదు. అసలు ఈ ట్రెండ్‌ను మహేష్‌ బాబు ఫ్యాన్స్ మొదలుపెట్టేశారు. గత ఏడాది మహేష్‌ బాబు బర్త్ డే స్పెషల్‌గా పోకిరి సినిమాను రీ రిలీజ్ చేశారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్‌ బర్త్ డే సందర్భంగా తమ్ముడు, జల్సా సినిమాలను విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా మహేష్‌ బాబు, పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ చేస్తోన్న ట్రెండ్‌లు చూడటం, వాటికి వచ్చిన కలెక్షన్లను చూసి మిగతా వాళ్లు కూడా రెడీ అయ్యారు. ఈ క్రమంలో బాలయ్య చెన్నకేశరెడ్డి సినిమాను రిలీజ్ చేశారు. కానీ దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ సినిమా కలెక్షన్లను దారుణాతి దారుణంగా వచ్చాయి. ఇక ప్రభాస్ విషయంలోనూ ఇలానే జరిగింది. బిల్లా, వర్షం సినిమాలు రీ రిలీజ్ చేస్తే కలెక్షన్లను రాబట్టలేకపోయాయి.


కానీ పవన్ కళ్యాణ్‌ ఖుషి సినిమాను న్యూ ఇయర్ స్పెషల్‌గా ఒక్క రోజు విడుదల చేశారు.ఆ సినిమాకు వచ్చిన డిమాండ్‌ను చూసి వారం రోజులు థియేటర్లు పెంచుకుంటూ పోయారు. అలా ఖుషి సినిమాకు కోట్లలో ఆదాయం వచ్చింది. ఖుషి సినిమాకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఖుషి లెక్కలు చూసి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది అందరికీ.


ఇక ఇప్పుడు చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 11న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. కానీ చివరి నిమిషంలో విడుదల తేదీని మార్చేశారు. పోస్ట్ పోన్ చేశాం.. సినిమాను విడుదల చేయడం లేదని చెప్పేశారు. 4kలోకి మార్చిన తరువాత సరైన అవుట్ పుట్ రాలేదని, అందుకే ఆపేశామని, త్వరలోనే మరో డేట్‌ను ప్రకటిస్తామని తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో మిగతా హీరోల ఫ్యాన్స్ ముందు పరువు పోయినట్టు అయందంటూ మెగా ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.


Also Read:  Ashu Reddy : జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం!.. అషూ రెడ్డి ముదురు కామెంట్లు


Also Read: Kiara Advani Wedding Pics : కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి.. రామ్ చరణ్ కామెంట్ ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook