Godfather Collections : చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించిన కలెక్షన్ల విషయంలో సోషల్ మీడియా రకరకాలుగా స్పందిస్తోంది. కొందరు గాడ్ ఫాదర్  కలెక్షన్ల నిజమే అని అంటుంటే.. ఇంకొందరు మాత్రం వాటిని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. కలెక్షన్లను బయటకు ప్రకటించను అని గతంలో చెప్పిన రామ్ చరణ్.. ఇప్పుడు మాట తప్పుతూ.. గాడ్ ఫాదర్ కలెక్షన్ల పోస్టర్లను రోజు రోజూ షేర్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ ఇలా చేస్తుండటంతో రామ్ చరణ్‌ను ట్రోల్స్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక మేకర్లు ప్రకటిస్తున్న పోస్టర్లు, అందులోకి నంబర్లు, ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న నంబర్లకు చాలా తేడా ఉందని తెలుస్తోంది. దీనిపై యాంటి ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ ఆరు రోజుల కలెక్షన్ల పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. అందులో ఉన్న ఫిగర్లు.. ఒరిజినల్ ఫిగర్లకు మధ్య ఎంతో తేడా ఉంది. ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 138 కోట్ల గ్రాస్, 75 కోట్ల షేర్ వసూల్ చేసినట్టుగా చూపిస్తున్నారు.


అయితే ట్రేడ్ వర్గాల లెక్కలు మాత్రం వేరేలా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆరో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.3కోట్ల గ్రాస్, 1.51 షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. అదే ఈ ఆరు రోజుల్లో అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో 38 కోట్ల షేర్, 63 కోట్ల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో 4.4 కోట్లు, హిందీలో 4.4కోట్లు, ఓవర్సీస్‌లో 4.5 కోట్లు ఇలా మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 51 కోట్ల షేర్, 93 కోట్ల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది.


కానీ అఫీషియల్ పోస్టర్లకు, ఒరిజినల్ కలెక్షన్లకు చాలా తేడా ఉందని ఇట్టే అర్థమవుతోంది. ఈ లెక్కన మూవీ 91 కోట్లకు బిజినెస్ చేస్తే..  ఇప్పటి వరకు 51 కోట్లు వచ్చాయి. ఇంకా దాదాపు 40 కోట్ల షేర్ రావాల్సి ఉంది. అంటే ఈ వీకెండ్ మొత్తం హౌస్ ఫుల్ నడిస్తే తప్పా బ్రేక్ ఈవెన్ అయ్యే చాన్స్ కనిపించడం లేదు. మరి గాడ్ ఫాదర్ చివరకు క్లీన్ హిట్ అవుతుందో లేదో చూడాలి.


Also Read : Rahul Koli Dies: ఆస్కార్‌ రేసులో ఉన్న 'ఛెల్లో షో' సినిమా చైల్డ్‌ ఆర్టిస్ట్‌ మృతి!


Also Read : GarikaPati - Chiranjeevi : అదృష్టం కొద్దీ చిరంజీవి అధికారంలోకి రాలేదు : గరికపాటి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook