Chiranjeevi - Surekha: ఈ రోజు మెగాస్టార్ చిరంజీవికి వెరీ వెరీ స్పెషల్ డే. ఈ రోజు తన భార్య సురేఖ పుట్టినరోజు. ఈ సందర్బంగా తన జీవిత భాగస్వామి  సురేఖను ఉద్దేశించి నా జీవిన రేఖ.. నా సౌభాగ్య రేఖ.. నా జీవిత భాగస్వామి సురేఖ అంటూ కోట్ చేస్తూ చిరు చేసిన ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కొణిదెల చిరంజీవితో అల్లు సురేఖల పెళ్లి 1980 ఫిబ్రవరి 20న ఉదయం 10.04 నిమిషాలకు మద్రాసులో అట్టహాసంగా జరిగింది. అపుడపుడే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవిలోని చురుకుదనం నచ్చి అప్పటికే టాప్ కమెడియన్‌గా రాణిస్తోన్న అల్లు రామలింగయ్య తన రెండో కూతురు సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేసారు. 1978లో 'ప్రాణం ఖరీదు' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. రెండో సినిమాలోనే తన కాబోయే మావయ్య అల్లు రామలింగయ్యతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చిరులోని వినయం నచ్చిన అల్లు రామలింగయ్య.. తన కూతురుకు కావాల్సింది ఇలాంటి వ్యక్తే అని గ్రహించి కొణిదెల శివశంకర వర ప్రసాద్‌ అలియాస్ చిరంజీవిని తన ఇంటి అల్లుడుగా చేసుకున్నారు. అప్పట్లో ఓ సందర్బంలో మందు తీసుకుంటావా అని అల్లు రామలింగయ్య అడగటం .. దానికి నేను ఆంజనేయ స్వామి భక్తున్ని అని చెప్పడంతో అల్లుకు అపుడే చిరుపై గురి కుదిరింది. ఆ తర్వాత తన కుమారుడు అల్లు అరవింద్‌తో చిరు గుణగణాలు ఏంటో పరిశీలించాలని కోరారు. ఆ తర్వాత నిర్మాత జయకృష్ణ సాయంతో చిరు మంచితనం తెలసుకున్నాడు. తన కూతురుకు పర్ఫెక్ట్ భర్తను తీసుకురావడంలో 100 శాతం సక్సెస్ సాధించారనే చెప్పాలి.


సురేఖ రాకతో చిరంజీవి సినీ రంగంలో భాగ్యరేఖ మారిపోవడానికి ఓ రకంగా భార్య సురేఖ రావడమే ఓ కారణం అని చెప్పాలి. మాములు హీరో నుంచి నెంబర్ హీరోగా మారాడు. ఇదంత సురేఖమ్మను పెళ్లి చేసుకున్న తర్వాతే చోటు చేసుకున్నాయి. ఏది ఏమైనా చిరంజీవి జీవన రేఖ.. సౌభాగ్య రేఖ మార్చిన వ్యక్తిగా సురేఖ నిలిచారు. వీళ్లిద్దరు ఈ నెల 20తో దంపతులుగా 44 యేళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఏది ఏమైనా వదినమ్మ సురేఖకు అన్నయ్య చెప్పిన స్పెషల్ బర్త్ డే విషెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరు విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు.


Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే


Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook