Bhola Shankar Set on Fire మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఒకే ప్రాజెక్ట్‌తో సందడి చేస్తున్నాడు. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో అజిత్ వేదాళం సినిమాను భోళా శంకర్‌గా రీమేక్ చేస్తున్నాడు. ఇందులో తమన్నా హీరోయిన్‌గా, కీర్తి సురేష్‌ చెల్లిగా చిరంజీవితో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ షూటింగ్‌ ఫుల్ స్వింగులో సాగుతోంది. అయితే చిరంజీవి భోళా శంకర్ యూనిట్‌కు పెద్ద షాక్ తగిలినట్టు అయింది. భోళా శంకర్ కోసం వేసిన సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిరంజీవి గత సినిమా (ఆచార్య) కోసం కోకాపేటలో ఓ సెట్ వేశారు. ఇప్పుడు ఈ సెట్‌లో కొన్ని సినిమాలు చిత్రీకరిస్తున్నారు. ఇక అదే సెట్‌ను వివిధ సినిమాలకు కూడా వాడేస్తున్నారు. ఆ సెట్‌ పాతది కావడంతో ఇలా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో అక్కడ ఎవ్వరూ లేరని, ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని సమాచారాం.


కోట్ల విలువైన ఈ సెట్‌ ఇప్పుడు తగలబడిపోవడంతో చిత్రయూనిట్‌ షాక్ అయింది. ఈ అగ్ని ప్రమాదం వల్ల నిర్మాతలకు భారీ నష్టమే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆచార్య కోసం వేసిన ధర్మస్థలి సెట్‌ పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. దాదాపు ఐదారు కోట్లతో వేసిన ఈ సెట్‌ ఇప్పుడు అగ్గిపాలైంది. అయితే నెటిజన్లు మాత్రం హమ్మయ్య అని అనుకుంటున్నారు.


ఈ ప్రమాదం ఏదో ఆచార్య షూటింగ్ సమయంలోనే జరిగినా బాగుండేది, సినిమా ఆగిపోయి ఉండేది.. డిజాస్టర్ వచ్చి ఉండేది కాదని అంటున్నారు. అయితే భోళా శంకర్ సినిమా మాత్రం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ అభిమానిగా చిరంజీవి నటిస్తున్నాడట.


ఇక ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్‌, భూమిక ఐకానిక్ నడుము సీన్‌ను ఇప్పుడు రీమేక్ చేయబోతోన్నారట. శ్రీముఖి, చిరంజీవిల మీద ఆ సీన్ ఉంటుందట. ఇక దీంతో జనాలు వద్దు బాబోయ్ అని తలలు పట్టేసుకుంటున్నారు. చిరంజీవి శ్రీముఖిలు ఆ సీన్‌ను రీమేక్ చేసి నాశనం చేయకండి అంటూ ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. మరి ఇలాంటి పైత్యాలను మెహర్ రమేష్ ఎందుకు రుద్దుతున్నాడో తెలియడం లేదు.


పైగా ఈ సినిమాలోనే రామ్మా చిలకమ్మా అనే పాటను కూడా రీమేక్ చేయబోతోన్నారట. ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలే వాల్తేరు వీరయ్యతో ఫాంలోకి వచ్చిన చిరంజీవికి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందా? అని మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నార్మల్ సినీ లవర్స్ సైతం ఎదురుచూస్తున్నారు.


Also Read:  Rahul Sipligunj : బికినీ భామలతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. బడ్జెట్ బద్దల్ బాషింగాలైంతాందట!


Also Read: Naga Chaitanya - Samantha : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అందుకే అలా చేసిందా? సమంతకు చైతూకి అదే తేడా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook