Chiranjeevi - Mohan Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో పైకి పొత్తులు కనిపించినా.. లోనా కత్తులుంటాయనేది చిరంజీవి, మోహన్ బాబులను చూస్తే తెలుస్తోంది. వీళ్లిద్దరు టామ్ అండ్ జెర్రీలా ఎన్నోసార్లు బహిరంగంగా విమర్శలు చేసుకున్నా.. ఆ తర్వాత కలిసి పోయి అభిమానులకు సైతం షాక్ ఇస్తూ ఉంటారు. అప్పట్లో మా ఎలక్షన్ సందర్భంగా వీళ్లిద్దరి మధ్య జరిగిన రచ్చ ఎవరు మరిచిపోలేరు. సినీ ఇండస్ట్రీలో ఉప్పు, నిప్పులా ఉండే వీళ్లిద్దరిలో మోహన్ బాబు చేసిన ఓ పని కారణంగా చిరంజీవి హీరోగా మళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గింజ గింజ మీద తినేవారి పేరు రాసినట్టు.. సినీ ఇండస్ట్రీలో ఒకరి కోసం అనుకున్న సినిమా వేరేకరి దగ్గకు వెళ్లడం కామన్‌గా జరుగుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు ఓ హీరో కోసం అనుకుంటే.. వేరొ హీరో దగ్గరకు ఆ కథలు వెళ్లి వాళ్లకు బంపర్ హిట్స్ ఇస్తుంటాయి. అలా మోహన్ బాబు కోసం అనుకున్న కథ.. చిరంజీవి దగ్గరకు వెళ్లడం.. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో చిరంజీవి మళ్లీ హీరోగా బ్యాక్ బౌన్స్ అయ్యారు.


అప్పట్లో చిరంజీవి ఎస్పీ పరశురామ్, ది జెంటిల్మెన్, బిగ్ బాస్, రిక్షావోడు వంటి డిజాస్టర్ మూవీస్‌తో వరుసగా మూడేళ్లు ఫ్లాపులతో సతమతమయ్యారు. అలాంటి సమయంలో చిరంజీవికి లైఫ్‌ ఇచ్చిన మూవీ హిట్లర్. ఈ సినిమాను ముందుగా నిర్మాతలు చిరంజీవితో చేయాలనుకోలేదు. మోహన్ బాబుతో తీయాలనుకున్నారు. నట ప్రపూర్ణ రిజెక్ట్ చేసిన తర్వాత కానీ ఈ సినిమా చిరంజీవి దగ్గరకు వచ్చింది.


'హిట్లర్' చిరు కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా. రీమేక్ సినిమా అయినా.. తెలుగు నేటివిటికి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేర్పులతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ అందించారు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. అయితే ఈ సినిమా వెనక పెద్ద తతంగమే నడిచింది. అదేమిటో తెలియాలంటే 28 యేళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. అది 1996లో .. అపుడే మలయాళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. దాని పేరు హిట్లర్. మమ్ముట్టి కథానాయకుడిగా సిద్ధిక్ దర్శకత్వంలో అపుడే తెరకెక్కుతోంది. అప్పటికే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. విడుదలకు వారం ముందుగానే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు ఎడిటర్ మోహన్. విడుదల తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియకుండానే ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. అక్కడ రిలీజ్‌కు ఒక రోజు ముందు హైదరాబాద్‌కు ఓ సీడీ వచ్చింది. అందులో హిట్లర్ సినిమా చూడాలంటే ప్రముఖ రచయత మరుధూరి రాజాకు చెప్పాడు నిర్మాత ఎడిటర్ మోహన్.  


ఓ అసిస్టెంట్ డైరెక్టర్.. తన భార్యతో కలిసి మరుధూరి రాజా ఓ హోటల్‌లో ఈ సినిమాను చూసారు. చూసి తెలుగులో తీస్తే బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారు. చిరంజీవి హీరోగా ఈ సినిమాను రీమేక్ చేయాలనుకున్న తర్వాత ఇదంత జరిగింది. అయితే ఎడిటర్ మోహన్ ముందుగా ఈ సినిమాను మోహన్ బాబు హీరోగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రీమేక్ చేద్దామనుకున్నాడు. ఇదే విషయాన్ని రైటర్‌ మరుధూరి రాజాకు చెబితే.. ఆయన వెళ్లి ఇవివి ఈ కథను వినిపించారు. అయితే అప్పటికే మోహన్ బాబుతో అదిరింది అల్లుడు, వీడెవండీ బాబు సినిమాలకు కమిటై ఉన్నారు ఇవివి. మరోసారి మోహన్ బాబుతో సినిమా అనగానే సింపుల్‌గా కాదన్నాడు.


ఇవివి కారణంగా మోహన్ బాబు చేతి నుంచి హిట్లర్ మూవీ చేజారింది. అయ్యో అనుకొని అంతా సైలెంట్‌గా ఉన్న సమయంలో ఈ సినిమాను చిరంజీవి రీమేక్ చేస్తున్నాడంటూ మరుధూరి రాజాకు ఎడిటర్ మోహన్ ఫోన్ చేసి మరి చెప్పాడు. అప్పటి వరకు చిన్న సినిమాలకు రైటర్‌గా పనిచేస్తోన్నమరుధూరి.. చిరు సినిమా ఆఫర్ రావడంతో ఉప్పొంగి పోయాడు. అయితే దర్శకుడిగా ఇవివి బదులుగా ముత్యలా సుబ్బయ్య లైన్‌లోకి రావడంతో ఆయన రైటర్‌గా మరుధూరి రాజాకు బదులు ఎల్బీ శ్రీరామ్‌ను రచయతగా తీసుకున్నాడు. ఆయన ఇది అవమానంగా ఫీలై మరుధూరి రాజా వెళ్లిపోయాడు. కానీ ఎడిటర్ మోహన్ కోరిన మీదట ఓ వెర్షన్ రాసిచ్చాడు.


ఇక ముత్యాల సుబ్బయ్య.. రైటర్ ఎల్బీ శ్రీరామ్ సహకారంతో చిరంజీవికి హిట్లర్ మూవీతో పెద్ద సక్సెస్ అందించాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీని రైటర్ మరుధూరి రాజా.. ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. హిట్లర్ ముందు చిరంజీవి వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. 1995 డిసెంబర్‌లో చిరంజీవి .. రిక్షావోడు సినిమాతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత 1996లో చిరు నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.అదే యేడాది 1996లో చిరు .. హిట్లర్ సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమా 1997 జవనరి 4న విడుదలై సంచలన విజయం సాధించి హీరోగా చిరంజీవికి పునర్జీవనం ఇచ్చింది. ఈ రకంగా మోహన్ బాబుకు పడాల్సిన సినిమాను చిరంజీవి దగ్గరకు వెళ్లడం... ఆ సినిమాతో చిరు హీరోగా బ్యాక్ బౌన్స్ అవ్వడం జరిగింది. ఆ రకంగా చిరుకు మోహన్ బాబు మరో లైఫ్ ఇచ్చాడనే చెప్పాలి.


Also read; Visa Free Countries: ఇండియన్ పాస్‌పోర్ట్ విలువ, ఈ 62 దేశాలకు వీసా లేకుండానే వెళ్లి రావచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook