Central Minister Anurag Thakur మెగా స్టార్ చిరంజీవి ఇంటికి కేంద్ర మంత్రి వచ్చాడు. కేంద్ర క్రీడా, యువజన శాఖా, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవి ఇంటికి వచ్చాడు. చిరంజీవి ఇంట్లో నాగార్జున, అల్లు అరవింద్, అనురాగ్ ఠాకూర్ భేటీ అయ్యారు. ఈ మేరకు చిత్రపరిశ్రమ అభివృద్ది, ఇతర రాజకీయ విషయాలు, పర్సనల్ విషయాలను చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు చిరు వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలే చిరంజీవి రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటున్నాడో అందరికీ తెలిసిందే. ఎంత దూరంగా ఉన్నా కూడా ఆయనకు పాలిటిక్స్ లింక్ చేస్తూ వార్తలు వస్తూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్‌కు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్టుగా చెప్పనూ లేడు.. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సత్సంబంధాలను తెంచుకోనూ లేడు. అలా ఎప్పుడూ ఎటూ మొగ్గకుండా నిశ్చలంగా ఉంటున్నాడు చిరంజీవి.


బీజేపీ ప్రభుత్వం చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తుందని, కేంద్రమంత్రిని చేస్తుందట అనే టాక్ ఎక్కువగా వచ్చిన సంగతి తెలిసిందే. అలా చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ మీద ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. కానీ తాను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని, సినిమానే తన ప్రపంచం అని చెప్పేస్తుంటాడు చిరంజీవి.


 



తాజాగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఇలా చిరంజీవి ఇంటికి వెళ్లడంతో మళ్లీ రూమర్లు మొదలయ్యాయి. మంత్రిని చిరు సత్కరించాడు. ఈ భేటీలో నాగార్జున, అల్లు అరవింద్ వంటి వారు కూడా ఉన్నారు. నిన్న హైద్రాబాద్‌కు వచ్చినప్పుడు ఇలా కాస్త వీలు చూసి మా ఇంటికి వచ్చి మాతో సమయం గడిపినందుకు థాంక్స్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇతరత్రా విషయాల గురించి మీతో చర్చించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది.. అంటూ చిరంజీవి ట్వీట్ వేశాడు.


ఈ ఫోటోల్లో నాగార్జున అందరి దృష్టిని ఆకర్షించాడు. గుబురు గడ్డంతో నాగార్జున కనిపించాడు. చూస్తుంటే ఇది రానున్న కొత్త సినిమా కోసం ట్రై చేస్తోన్న లుక్‌లా కనిపిస్తోంది. చాలా రోజుల తరువాత చిరంజీవి, అల్లు అరవింద్ కూడా ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. దీంతో మెగా అల్లు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


Also Read:  Rahul Sipligunj : బికినీ భామలతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. బడ్జెట్ బద్దల్ బాషింగాలైంతాందట!


Also Read: Naga Chaitanya - Samantha : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అందుకే అలా చేసిందా? సమంతకు చైతూకి అదే తేడా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook