Chiranjeevi new Movie: మరో మలయాళం మూవీ రీమేక్‌లో చిరంజీవి?
Chiranjeevi new Movie: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్‌లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గాడ్ ఫాధర్, భోళా శంకర్ వంటి రీమేక్ సినిమాలు చేస్తున్నారు చిరు. తాజాగా మరో మలయాళం మూవీ రీమేక్‌కు సిద్ధమైనట్లు టాక్.
Chiranjeevi new Movie: మెగా స్టార్ చిరంజీవి కొత్త సినిమాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరుసగా పలు సినిమాలు విడుదలకు సిద్ధమవగా.. మరికొన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. తాజాగా మరో సినిమాకు కూడా చిరూ ఒకే చెప్పినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
మరో రీమేక్..
చిరంజీవీ, రామ్ చరణ్‌లు హీరోగాలుగా నటించిన ఆచార్య సినిమా ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కొరటాల శివ ఈ మూవీకి దర్శకుకడు, ఈ మూవీ కాకుడం మెగాస్టార్ రెండు రీమేక్ సినిమాల్లో నటిస్తున్నారు. ఒకటి తమిళంలో హిట్టయిన 'వేదాళం'. దీనిని భోళా శంకర్ పేరుతో మెహర్ రమేశ్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్నారు.
మరో మూవీ మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన 'లూసీఫర్'. 2019లో వచ్చిన ఊ మూవీలో మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు హీరోలుగా నటించారు. ఈ మూవీకి దర్శకుడు కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ కావడం గమనార్హం. ఇదే సినిమాను గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తున్నార చిరంజీవి.
ఇక మోహన్‌లాన్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో.. ఈ ఏడాది విడుదలైన 'బ్రో డాడీ' సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పు్డు ఈ మూవీని కూడా తెలుగులో చిరంజీవీ రీమేక్ చేసేందుకు సిద్ధమైనట్లు సినివార్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే దీనిపై ఇంతక వరకు అధికారికంగా ప్రకటన వెలువడలేదు.
Also read: రాజమౌళికి సానుభూతి ఉండదు.. ఆరోగ్యం బాగాలేకపోయినా నాతో షూటింగ్ చేపించారు! స్టార్ హీరో ఫిర్యాదు!!
Also read: SS Rajamouli: ఇంకో 'ఆర్ఆర్ఆర్' సినిమా కూడా ఉంది.. అంతకుమించి కామెడీ ఉంటుంది: రాజమౌళి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook