Acharya Pre Release Event: ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ముఖ్య అతిథిగా స్టార్ డైరెక్టర్?
Chiranjeevi`s Acharya Pre-Release Event Date. ఆచార్య చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. ఏప్రిల్ 23న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుందని పేర్కొన్నారు.
Acharya Movie Pre Release Event on April 23rd from 6 PM: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా సినిమా 'ఆచార్య'. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆచార్య సినిమా.. ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఇటీవల ట్రైలర్‌ను రిలీజ్ చేసిన చిత్ర బృందం.. తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చింది.
ఆచార్య చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. ఏప్రిల్ 23న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ' తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. విషయం తెలుసుకున్న ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు వెళ్లేందుకు మెగా అభిమానులు ఇప్పటినుంచే సిద్దమవుతున్నారు. మరోవైపు పోలీస్ గ్రౌండ్స్‌లో పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రానున్నాడని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో గెస్ట్‌గా రానున్నట్లు గత రెండు మూడు రోజుల నుంచి ప్రచారం జరిగింది. అయితే పవన్‌కు అదే రోజున వెస్ట్ గోదావరి పర్యటన ఉంది. దాంతో పవన్ ఆచార్య ప్రీ రిలీజ్ వెంట్‌కు దాదాపుగా హాజరుకాకపోవచ్చు. ఆచార్య కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగుతున్నారట. వాయిస్ ఓవర్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ టాక్.
డైరెక్టర్ కొరటాల శివ, చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఆచార్య మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సాధిస్తున్నాయి. ఇక చిరు, చరణ్‌లు తొలిసారిగా పూర్తిసాయిలో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటుండడంతో మెగా అభిమానుల్లో సినిమాపై ఉత్కంఠ నెలకొంది.
Also Read: Vehicles Honking: వాహన దారులారా.. జర జాగ్రత్త! హైదరాబాద్‌లో ఇకపై హారన్ కొడితే అంతే సంగతులు
Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షం.. నగర వాసులకు ఉపశమనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.