Acharya New Release Date: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ఆచార్య అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది!!
టాలీవుడ్ `మెగాస్టార్` చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నామని చిత్ర బృందం `కొణిదెల ప్రో కంపెనీ` ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది.
Acharya movie Release on April 29th: కరోనా వైరస్ థార్డ్ వేవ్ కారణంగా టాలీవుడ్ 'మెగాస్టార్' చిరంజీవి హీరోగా నటించిన 'ఆచార్య' సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 4న విడుదల అవ్వాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నామని ఇటీవల చిత్ర బృందం ట్వీట్ చేసింది. కరోనా పరిస్థితుల దృష్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని పేర్కొంది. చెప్పినట్టుగానే ఆచార్య చిత్ర బృందం చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందించింది. ఈరోజు ఆచార్య సినిమా విడుదల డేట్‌ను ప్రకటించింది.
ఆచార్య సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నామని చిత్ర బృందం ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. 'కొన్ని చర్చలు, పరస్పర అవగాహన అనంతరం ఆచార్య సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నాం. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది' అని కొణిదెల ప్రో కంపెనీ ఓ ట్వీట్ చేసింది. ఆర్‌ఆర్‌ఆర్ మార్చి 25న వస్తున్న కారణంగా ఆచార్యను కాస్త లేటుగా రిలీజ్ చేస్తున్నామని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నక్సలైట్లుగా నటిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ జతగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. దేవదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో ఈ సినిమా కథ తెరకెక్కింది.
దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో భారీ మల్టీ స్టారర్‌గా వస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్ఆర్' రిలీజ్ డేట్ కూడా అధికారికంగా వచ్చింది. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఈరోజు స్పష్టం చేశారు. ఇప్పటివరకు కరోనా కారణంగా నాలుగు సార్లు 'ఆర్‌ఆర్ఆర్ వాయిదా పడింది. 'భీమ్లా నాయక్' చిత్ర యూనిట్ కూడా విడుదల తేదీపై ఓ ప్రకటన చేసింది. స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, రానాలు హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.
Also Read: IPL 2022 Auction: 'తప్పలేదు మరి.. శుభ్‌మన్ గిల్‌ను కోల్పోవడం బాధగా ఉంది'
Also Read: IPL 2022 Auction: 'తప్పలేదు మరి.. శుభ్‌మన్ గిల్‌ను కోల్పోవడం బాధగా ఉంది'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook