Chiranjeevi behind Samantha and Naga Chaitanya divorce: 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2010లో విడుదలైన.. ఏమాయ చేసావే సినిమా షూటింగ్ సెట్స్.. మీద మొదటిసారిగా కలుసుకున్నారు నాగచైతన్య, సమంత. చాలాకాలం మంచి స్నేహితులుగా ఉన్న వీళ్లు.. ఆ తర్వాత ప్రేమలో కూడా పడ్డారు. కొంతకాలం డేటింగ్ కూడా చేసిన ఈ జంట.. 2017లో పెళ్లి చేసుకున్నారు. 


టాలీవుడ్ లో ఉన్న సెలబ్రిటీ జంటలలో.. నాగచైతన్య సమంతలకి.. ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ.. మాత్రమే కాక ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీకి కూడా అభిమానులు ఫిదా అవుతూ ఉండేవాళ్లు. కానీ పెళ్లయిన నాలుగేళ్లకే.. 2021లో ఈ జంట విడాకులు ప్రకటించింది. 


అసలు ఎంతో అన్యోన్యంగా ఉండే ఇద్దరు విడాకులు.. ఎందుకు తీసుకున్నారు అనేది.. ఇంకా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నాగచైతన్య, సమంత మళ్ళీ కలిస్తే బాగుంటుందని ఇప్పటికీ చాలామంది అభిమానులు అనుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి..మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరకంగా కారణం అని.. కొందరు కామెంట్లు చేస్తున్నారు.


సమంత పెళ్లయిన తర్వాత మొదటగా నటించింది.. రామ్ చరణ్ సరసన రంగస్థలం సినిమాలోనే. నిజానికి ఆ సినిమా ఆఫర్ సమంతకి వెళ్ళకముందు.. చిత్ర బృందం మొదట కొంచెం సంకోచించిందట. అప్పుడే పెళ్లి చేసుకున్న హీరోయిన్.. పైగా అక్కినేని ఇంటి కోడలు.. అని మొదట చిత్ర దర్శక నిర్మాతలు ఆమెను వద్దు అని కూడా అనుకున్నారట. 


అప్పుడే మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. పెళ్లయితే ఏమైంది? హీరోయినే కదా. వెళ్లి కథ చెప్పండి నచ్చితే చేస్తుంది లేకపోతే తానే.. నో చెప్తుంది కదా.. అని చిరంజీవి చెప్పారట. చిరు అలా చెప్పిన తర్వాతే చిత్ర బృందం సమంతను.. కలిసి కథ చెప్పారు. ఇక సమంతకి తన పాత్ర బాగా నచ్చేసి వెంటనే ఓకే చెప్పేసింది. 


రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఆమెకు బోలెడు ఆఫర్లు.. వచ్చి పడ్డాయి. ఆమె క్రేజ్ బాగా పెరిగిపోయి ది ఫ్యామిలీ మ్యాన్ లో కూడా నటించే అవకాశం వచ్చింది. అయితే అందులో ఉన్న బోల్డ్ సన్నివేశాల కారణంగానే..మొట్టమొదటిసారిగా నాగచైతన్య సమంతలకి మధ్య గొడవ అయిందని అదే విడాకులు దాకా వెళ్ళింది అని ఇప్పటికీ చాలామంది చెబుతూ ఉంటారు 


ఒకవేళ అది నిజం అయితే.. చిరంజీవి కూడా నాగచైతన్య, సమంతల విడాకులకి పరోక్షంగా కారణం అవుతారు. దీంతో నాగచైతన్య సమంతల.. విడాకులలో చిరంజీవి హస్తం కూడా ఉంది.. అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read: YS Jagan Sharmila: ఒకే వేదికపై వైఎస్‌ జగన్, షర్మిల.. ఆరోజు ఏం జరగబోతున్నది?


Also Read: YS Jagan Case: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు భారీ ఎదురుదెబ్బ.. త్వరలోనే జైలుకు?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి