Chiranjeevi about Pawan Kalyan: నిన్న ఢిల్లీలో చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ స్పెషల్ ఈవెంట్ ని పురస్కరించుకొని ఒక పాపులర్ మీడియా ఛానల్..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ ని ఏర్పాటు చేసింది. కాగా ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు మెగాస్టార్. ముఖ్యంగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్, అలానే తన కొడుకు రామ్ చరణ్ నటించిన సినిమాలలో తన ఫేవరెట్ సినిమాలు ఏవో చెప్పేసారు. ఈ విషయాలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిరంజీవి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో తనకు అన్నీ ఇష్టమైనవే అని.. కానీ ముఖ్యంగా తొలిప్రేమ, బద్రి, జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఇంకా బాగా ఇష్టం అని అన్నారు చిరంజీవి. 


పవన్ కళ్యాణ్ నటించింది కొన్ని సినిమాల్లోనే అయినప్పటికీ, ఒకటో రెండో తప్ప అన్నీ మంచి సినిమాలే అన్నారు. ఇక తనయుడు రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. రామ్ చరణ్ నటించిన సినిమాలలో మగధీర అంటే ఇష్టం అని చెప్పారు. మధ్యలో జోక్యం చేసుకున్న కిషన్ రెడ్డి "ఆ సినిమా రిలీజైనప్పుడు జరిగిన ఓ ఘటన గుర్తు వచ్చింది. అప్పట్లో మీరు (చిరంజీవి) ఎమ్మెల్యేగా ఉన్నారు. అసెంబ్లీలో నా దగ్గరికి వచ్చి మా అబ్బాయి సినిమా చాలా బాగా ఆడుతోంది అని చెప్పి సంతోషంగా చెప్పారు" అని అన్నారు.


చిరంజీవి, కిషన్ రెడ్డి సినిమాలతోపాటు రాజకీయాలు, ఆర్టికల్ 370 వంటి ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నారు. "నన్ను ఎంతో ఆదరించిన ప్రజలకు నేను తిరిగి ఏదో చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాను తప్ప పదవుల కోసం కాదు" అన్నారు చిరంజీవి. ఆర్టికల్ 370 గురించి మాట్లాడుతూ అది ఎత్తేసిన తర్వాత కాశ్మీర్ లో పరిస్థితులు చక్కబడ్డాయి అని, అప్పటి నుంచి 300 సినిమాల వరకు అక్కడ చిత్రీకరించారని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కొవిడ్ సమయంలో వాళ్ళు చేసిన సేవలను కూడా గుర్తు చేసుకున్నారు.


గురువారం మే 9 నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరు పద్మ విభూషణ్  అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. మన భారత దేశంలో భారతరత్న అవార్డు తర్వాత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్. దానికి అందుకోవడం తనకు చాలా గర్వంగా ఉంది అని చిరంజీవి సంతోషాన్ని వ్యక్త పరిచారు. ఈ సన్మాన కార్యక్రమానికి చిరంజీవి తో పాటు భార్య సురేఖ, తనయుడు రామ్ చరణ్, అతని భార్య ఉపాసన ల కూడా హాజరయ్యారు. 


ఇక ఇటు పాలిటిక్స్ కి దూరంగా ఉంటూ మళ్ళీ సినిమాలు చేస్తున్న చిరంజీవి గాడ్ ఫాథర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నారు. కానీ ఈమధ్యనే వచ్చిన భోళా శంకర్ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ప్రస్తుతం చిరు బింబిసార ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాతో బిజీగా ఉన్నారు.


Also Read: KTR: ఎన్నికల్లో 12 ఎంపీలు ఇవ్వండి.. కేసీఆర్‌ను సీఎం చేద్దాం: కేటీఆర్‌ పిలుపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook