Venkatesh: సీనియర్ హీరోల్లో మాస్ సినిమాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి అయితే, ఫ్యామిలీ స్టోరీస్ అని వినగానే ముందుగా గుర్తొచ్చేది వెంకటేష్ పేరు. ఇద్దరూ పక్క భిన్న ధ్రువాలు. కానీ ఇద్దరికీ ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి అలాంటి ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నాము అని చెబితే తమ తమ ఫ్యాన్స్ ఎంత ఖుషి అవుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి సంఘటనే ఈమధ్య చోటుచేసుకుని సినీ అభిమానుల్లో ఒక ఆనందాన్ని రేకెత్తించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు విషయానికి వస్తే ఎన్నో సినిమాలు చేసి వెంకటేష్ నుంచి విక్టరీ వెంకటేష్ గా పేరు తెచ్చుకున్న మన వెంకీ మామ.. ప్రస్తుతం తన 75వ సినిమా ‘సైంధవ్‌’ తో మన‌ ముందుకు రానున్నారు. కాగా వెంకటేష్ 75 సినిమాలు కంప్లీట్ చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియచేస్తూ సైంధవ్‌ నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఇటీవల ఓ గ్రాండ్ ఈవెంట్ ని అభిమానుల మధ్య నిర్వహించింది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చి సందడి చేశారు. కాగా ఈ ఈవెంట్ జరిగినప్పుడు మేకర్స్ ఇది లైవ్ టెలికాస్ట్ ఇవ్వలేదు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ విన్ యాప్ లో ఈవెంట్ ని టెలికాస్ట్ చేశారు. దీంతో ఈవెంట్ లో జరిగిన ఆసక్తికర సంఘటనలు బయటకి వస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి వెంకటేష్ గురించి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.


ఈ ఈవెంట్ లో మెగాస్టార్ వెంకటేష్ తో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్తూ వీరిద్దరి కాంబోలో సినిమా కూడా ఉంటుందని చెప్పి అక్కడ ఉన్న ప్రేక్షకుల దగ్గర విజిల్స్ వేయిచ్చారు. చిరంజీవి తమ ఇద్దరి కాంబో సినిమా గురించి మాట్లాడుతూ.. ‘మేమిద్దరం కలిసి సినిమా చేస్తే బాగుంటుందని అన్నారు. ఇప్పుడు నా వెనక ఎలా అయితే వెంకటేష్ నిల్చున్నాడో.. అలాగే నిన్ను ముందు పెడతాను నేను వెనకాల ఉంటాను చిరు. నువ్వు నా ముందుండి కమాండ్ వేస్తే నేను వెనక నుంచి నరుక్కుంటూ వస్తాను అని వెంకీ ఆల్రెడీ నాకు స్టోరీ లైన్ కూడా చెప్పేసాడు. ఒకవేళ అలాంటి కథ వస్తే  తప్పకుండా మేమిద్దరం కలిసి సినిమా చేస్తాము. అందుకే అలాంటి కథ వీలైనంత త్వరలో రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. దీంతో అభిమానులు, ప్రేక్షకులు వీరిద్దరి కాంబోలో సినిమా త్వరగా రావాలని కోరుకుంటున్నారు. మరి ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఇది నిజంగానే నిజమై తెలుగు ప్రేక్షకుల ముందుకి ఒక బ్లాక్ బస్టర్ సినిమా రాబోతుందేమో వేచి చూద్దాం. 


Also read: PPF Benefits: నెలకు 5 వేలు ఇన్వెస్ట్ చేస్తే ఒకేసారి 26 లక్షలు పొందే అద్భుత పధకం


Also read: Ap New Pension Scheme: సంక్షేమ పథకాలతో ఎన్నికల ఏడాది ప్రారంభం, ఇవాళ్టి నుంచి 3 వేల పెన్షన్, కొత్త రేషన్ కార్డులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook