Vishwambhara Release Date: మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసు దాటినా కూడా అంతే ఎనర్జిటిక్ గా వరుస సినిమాలు.. చేస్తూ ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా వరుస సినిమాలు చేయడమే కాదు ఆ సినిమాలతో మంచి విజయం సాధించి,  బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతున్నారు కూడా.. ఇదిలా ఉండగా వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న చిరంజీవి భోళా శంకర్ సినిమాతో బొక్క బోర్ల పడ్డారని చెప్పాలి. దీంతో ఇకపై రీమేక్ చిత్రాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలోనే చిరంజీవి.. బింబిసారా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వశిష్ట మల్లిడితో విశ్వంభరా సినిమా ప్రకటించారు. ఈ సినిమా జనవరి 10వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే ఏడాది విడుదల చేస్తామని కూడా తెలిపారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్లు సమాచారం. 


అసలు కారణమేంటంటే. మెగాస్టార్ చిరంజీవి గత కొన్ని రోజులుగా చికెన్ గున్యా వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.ఇటీవల ఈయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నప్పుడు ఏర్పాటు చేసిన ఈవెంట్లో యాంకర్ ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో సెలబ్రిటీలతోపాటు అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. త్వరగా రికవరీ అవ్వాలని కోరుకున్నారు కూడా.  అయితే వయసు మీద పడడంతో వ్యాధి తాలూకా సమస్యల నుంచి ఇంకా తేరుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే విశ్వంభరా సినిమాలో మిగిలి ఉన్న షూటింగ్ ను  కూడా కంప్లీట్ చేయలేకపోతున్నారట. అందులో భాగంగానే షూటింగ్ స్పాట్ కి వెళ్లి సినిమా షూటింగ్లో పాల్గొనలేక పోతున్నట్లు సమాచారం.  మొత్తానికైతే బాడీ సహకరించకపోవడం..వల్లే సినిమా షూటింగ్ కంప్లీట్ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. 


దీనికి తోడు ఓటిటి డీల్ కూడా ఫిక్స్ కాలేదని సమాచారం. భారీ బడ్జెట్ మూవీ కావడంతో మరొకవైపు తక్కువ ఆఫర్ చేయడం వల్లే ఓటీటీ డీల్ కుదరలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే విశ్వంభరా సినిమా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోబోతున్నట్లు తెలిపి,  అభిమానులను నిరాశపరిచిందని చెప్పవచ్చు. 


ఇక మరొకవైపు డిసెంబర్ 20వ తేదీన విడుదల కావాల్సిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ కూడా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం దేశీయంగా అలాగే ప్రీమియర్స్లో గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో డిసెంబర్ 20 నుంచి వాయిదా వేస్తూ సంక్రాంతి బరిలోకి దింపడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


Read more: Hydra Victims: నీ అయ్య జాగీరా ఎవడ్రా నువ్వు మా ఇల్లు కూలగొట్టేది.. హైడ్రా వర్సెస్ మూసీ బాధితులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.