Chiranjeevi - Vishwambhara: రీసెంట్‌గా చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో గౌరవించింది. దీనిపై అందరు హర్షం వ్యక్తం చేస్తుండగాన.. మరికొందరు మాత్రం చిరు కంటే అర్హులైన వాళ్లు తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారనే కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈయనకు మాత్రం ఈ అవార్డు రావడంపై కొంత మంది తమ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. మరోవైపు చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాస్ట్ ఇయర్ 'వాల్తేరు వీరయ్య'తో మంచి హిట్ అందుకున్న చిరంజీవి.. ఆ తర్వాత చేసిన 'భోళా శంకర్' కాస్త బోల్తా శంకర్ అయింది. ఈ మూవీ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. మొత్తంగా చిరు కెరీర్‌లోనే మాయని మచ్చగా మిగిలిపోయింది. దీంతో తన తదుపరి చిత్రాలపై జాగ్రత్తగా ఫోకస్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో న్యూ టాలెంట్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ముందుగా 'ముల్లోక వీరుడు' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. కానీ ఫైనల్‌గా ఈ మూవీకి 'విశ్వంభర' టైటిల్ ఫిక్స్ చేసారు.


ఈ చిత్రంలో చిరు సరసన త్రిష సహా మరో ఇద్దరు భామలు నటిస్తున్నారు. మరోవైపు వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఇక యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి. అంజి సినిమాల తర్వాత నటిస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ ఇదే కావడం గమనార్హం. ఈ మూవీలో చిరును ఢీ కొట్టే విలన్ పాత్రలో తమిళ హీరో శింబు నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కథ విని ఇందులో చిరు పక్కన నటించాలనే కోరికతో ఈ మూవీలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.


చిరు గత కొన్నేళ్లుగా తన చిత్రాల్లో ఇతర హీరోలకు ముఖ్యపాత్రలు ఇస్తున్నారు. సైరా నరసింహారెడ్డిలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, రవికిషన్‌లు ఇతర పాత్రల్లో నటించారు. అటు ఆచార్యలో రామ్ చరణ్ నటించాడు. ఆ తర్వాత వచ్చిన 'గాడ్ ఫాదర్' మూవీలో సత్యదేవ్ నటించారు. వాల్తేరు వీరయ్యలో రవితేజ నటిస్తే.. భోళా శంకర్ మూవీలో సుశాంత్ నటించాడు. ఇపుడు తాజాగా శింబు చిరు సినిమాలో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.ఘరానా మొగుడు, ఆపద్భాందవుడు, ఎస్పీ పరశురామ్ సినిమాల తర్వాత కీరవాణి చిరు సంగీతం అందిస్తున్నారు.


Also Read: India Vs Eng: ఉప్పల్‌లో భారత జట్టుకు తీవ్ర నిరాశ.. టామ్ హార్ట్‌లేకు హార్ట్‌ లేదబ్బా


Also Read: Bottole Thrash: 'బాటిల్‌' కోసం చెప్పుతో కొట్టిన ప్రముఖ గాయకుడు.. నెట్టింట్లో తీవ్ర దుమారం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి