Chiranjeevi Vishwambhara Update: 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య.. ఎప్పటినుంచో బీభత్సమైన కాంపిటేషన్ ఉంది. ఇద్దరూ దాదాపు ఒకే సమయంలో.. ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయమయ్యారు. హీరోలుగా తమ కెరీర్ ను మొదలుపెట్టినప్పటి నుంచి.. ఎప్పటికప్పుడు ఒకరికొకరు గట్టి పోటీ ఇచ్చుకుంటూ వచ్చారు. 


అయితే ఒకానొక సమయంలో.. బాలకృష్ణ కి వరుస ఫ్లాప్స్ వచ్చాయి. అదే సమయంలో చిరంజీవి వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. దీంతో చిరంజీవి ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ స్థానానికి ఎదిగిపోయారు. అయితే ఇప్పుడు మాత్రం.. రోజులు మారిపోయాయి. చిరంజీవి కంటే బాలకృష్ణ మీద ఉన్న క్రేజ్.. భారీ స్థాయిలో పెరుగుతోంది. 


సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత… చిరంజీవి కెరియర్ లో పెద్ద చెప్పుకోదగ్గ హిట్స్..ఒక్కటి కూడా లేదు. వాల్తేరు వీరయ్య సినిమాతో.. పర్వాలేదు అనిపించారు కానీ కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అయితే కాలేదు. మరోవైపు బాలకృష్ణ మాత్రం అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి.. అంటూ వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నారు. 


చిరంజీవి సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటున్నప్పటికీ… కలెక్షన్లు మాత్రం అందుకోలేకపోతున్నాయి. మరోవైపు బాలకృష్ణ సినిమాలు మాత్రం.. విడుదలై  వారం కూడా తిరక్కముందే బ్రేక్ ఈవెన్ పాయింట్ ను.. దాటి డిస్ట్రిబ్యూటర్లకు ప్రాఫిట్ల వర్షం కురిపిస్తున్నాయి. 


మరోవైపు ఓటీటీలో కూడా చిరంజీవి చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు కంటే.. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన..అన్ స్టాపబుల్ హిట్ అయింది. ఓటిటిలలో కూడా బాలకృష్ణ బాగానే క్లిక్ అయ్యారు. దీంతో బాలకృష్ణ ఇప్పుడు నెమ్మదిగా నంబర్ వన్ స్థానాన్ని.. ఆక్రమించే దిశగా దూసుకు వెళ్తున్నారు.


ప్రస్తుతం చిరంజీవి చేతిలో విశ్వంభర సినిమానే ఆయుధంగా పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్ అయితే చిరంజీవి.. తన నంబర్ వన్ స్థానాన్ని కొనసాగించొచ్చు. కానీ ఒకవేళ పరిస్థితులు బాలేక ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం.. చిరంజీవి నంబర్ వన్ స్థానం నుంచి కిందకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.


మరోవైపు బాలకృష్ణ కూడా కే.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో.. ఒక సినిమా చేస్తున్నారు. అంతేకాకుండా తనకి మూడు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన బోయపాటి డైరెక్షన్ లో కూడా మరొక సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్లు అయితే కూడా బాలయ్య నంబర్ వన్ గా మారే అవకాశం ఉంది.


Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..


Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter